ద్రవ్యలోటు రూ. 8.55 లక్షల కోట్లు

ద్రవ్యలోటు రూ.  8.55 లక్షల కోట్లు

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు (ఖర్చులు, ఆదాయం మధ్య తేడా) గత ఏడాది డిసెంబరు నాటికి రూ.8.55 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది 2025 బడ్జెట్ లక్ష్యంలో 54.5 శాతం. గతేడాది ఇదే కాలంలో ఆర్థిక లోటు లక్ష్యంలో 56.7 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో ఆర్థిక లోటును రూ.15.69 లక్షల కోట్లకు (4.4 శాతం) పరిమితం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబరు వరకు కేంద్రానికి మొత్తం రూ.25.25 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 72.2 శాతం. ఇందులో పన్నుల ద్వారా వచ్చిన నికర ఆదాయం రూ.19.39 లక్షల కోట్లు కాగా, పన్నేతర ఆదాయం రూ.5.39 లక్షల కోట్లు ఉంది. అప్పులు కాని మూలధన రాబడుల ద్వారా రూ.46,047 కోట్లు వచ్చాయని  కేంద్ర ప్రభుత్వం తెలిపింది.