
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్ సహ వ్యవస్థాపకుడు రాకేశ్ గంగ్వాల్ మంగళవారం 1.32 కోట్ల షేర్లను బ్లాక్ డీల్ ద్వారా సేల్ చేయనున్నారని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఇది కంపెనీలో 3.4 శాతం వాటాకు సమానం. ఒక్కో షేరుని రూ.5,175 ధరకు అమ్మనున్నారని, వీటి విలువ రూ.6,831 కోట్లు (803 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. ఇండిగో షేర్లు సోమవారం రూ.5,420 దగ్గర ముగిశాయి. దీంతో పోలిస్తే గంగ్వాల్ 4.5 శాతం డిస్కౌంట్‌కు షేర్లను అమ్మనున్నారు.