
- 33.02 శాతం గ్రౌండింగ్
- యాదాద్రిలో స్పీడ్.. సూర్యాపేటలో స్లో
యాదాద్రి, వెలుగు : పదేండ్ల తర్వాత పేదోడి సొంతింటి కల సాకారమవుతోంది. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు స్పీడ్అందుకున్నాయి. ఇండ్ల నిర్మాణ పనులు వివిధ దశలో కొనసాగుతున్నాయి. పలువురు లబ్ధిదారులు వివిధ దశలకు సంబంధించిన బిల్లులు కూడా అందుకుంటున్నారు. నిర్మాణ విస్తీర్ణంలో తేడా రాకుండా హౌసింగ్డిపార్ట్మెంట్చర్యలు తీసుకుంటోంది. అధికారులు పలుమార్లు సర్వే నిర్వహించి అర్హులను గుర్తించి ఎల్–-1గా ఎంపిక చేశారు. వీరికి విడతల వారీగా ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేయనుంది. మండలానికో పైలట్ గ్రామాన్ని ఎంపిక చేయడంతో ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ముగ్గులు పోసుకుంటుండ్రు..
మొదటి విడత లబ్ధిదారులకు ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేసింది. దీంతో లబ్ధిదారులు ఎక్కడికక్కడ ముగ్గులు పోసుకుంటున్నారు. రూల్స్ ప్రకారం 400 ఎస్ఎఫ్ టీ నుంచి 600 ఎస్ఎఫ్టీ ప్లేస్లోనే ఇల్లు నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు లబ్ధిదారులు ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారు. దీంతో బిల్లుల మంజూరు విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. బేస్మెంట్లు పూర్తయినా బిల్లులు ఆగిపోయాయి.
దీంతో రంగంలోకి దిగిన హౌసింగ్స్టాఫ్ కొందరి బేస్మెంట్లు సరి చేశారు. తాజాగా ముగ్గులు పోస్తున్న లబ్ధిదారులకు 400 ఎస్ఎఫ్టీకి తగ్గకుండా, 600 ఎస్ఎఫ్టీకి పెరగకుండా ఇండ్లు నిర్మించుకోవాలని ముందే చెప్పేస్తున్నారు. అవసరమైతే దగ్గర ఉండి సరి చేయిస్తున్నారు. దీంతో గతంలో మాదిరిగా బిల్లుల విషయంలో అంత ఇబ్బంది కలగడం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 32,051 ఇండ్లు శాంక్షన్..
ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో 32,051 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 12,749 (39.2 శాతం) ఇండ్లు గ్రౌండింగ్అయ్యాయి. వీటిలో 1,815 బేస్మెంట్ నిర్మాణాలు జరగగా, 577 ఇండ్లకు గోడలు లేచాయి. 193 ఇండ్లు స్లాబ్ లెవల్‌కు చేరుకోగా, రెండిండ్ల నిర్మాణం పూర్తయింది.
యాదాద్రిలో స్పీడ్.. సూర్యాపేటలో స్లో..
ఇండ్ల నిర్మాణంలో యాదాద్రి జిల్లా స్పీడ్‌గా ముందుకు సాగుతుంటే.. నల్గొండ, సూర్యాపేట జిల్లాలు వెనుకబడ్డాయి. యాదాద్రి జిల్లాకు 9,175 ఇండ్లు శాంక్షన్ కాగా, 5,635 గ్రౌండింగ్పూర్తయ్యాయి. ఇందులో 399 బేస్మెంట్ లెవల్లో ఉన్నాయి. 131 ఇండ్ల గోడలు లేవగా, 34 స్లాబ్ లెవల్‌కు చేరుకున్నాయి. నల్గొండ ఓ మోస్తారుగా ముందుకు సాగుతోంది. ఈ జిల్లాకు 17,058 ఇండ్లు మంజూరయ్యాయి. 5,846 గ్రౌండింగ్ అయ్యాయి.
514 బేస్మెంట్ లెవల్లో ఉండగా, 85 ఇండ్లకు గోడలు లేచాయి. 17 ఇండ్లు స్లాబ్ లెవల్ కు చేరుకున్నాయి. -ఇండ్ల నిర్మాణంలో సూర్యాపేట జిల్లా కొంత వెనుకబడింది. అయినప్పటికీ రెండు ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఈ జిల్లాకు 5,818 ఇండ్లు మంజూరు కాగా, 1,268 ఇండ్లు గ్రౌండింగ్అయ్యాయి. 902 బేస్మెంట్ లెవల్లో ఉండగా, 361 ఇండ్లకు గోడలు లేచాయి. 142 స్టాబ్ లెవల్‌కు చేరుకోగా, రెండిండ్ల నిర్మాణం పూర్తయింది.