ఇండో–అమెరికన్ డాక్టర్ల ప్రాణాలు తీస్తున్న కరోనా

ఇండో–అమెరికన్ డాక్టర్ల ప్రాణాలు తీస్తున్న కరోనా

వాషింగ్టన్: న్యూయార్క్ లోని ఓ ఆస్పత్రి. బెడ్ పై నిద్రించే ముందు భర్తకు ఫోన్ చేసింది డాక్టర్ అయా మాధవి (61). ఆమె తన వాళ్లను కలుసుకోలేదు. కేవలం మెసేజ్ ల ద్వారానే మాట్లాడింది. గత నెలలో ఓ పేషెంట్ కు ట్రీట్ మెంట్ ఇస్తున్నప్పుడు ఆమెకు కరోనా సోకింది.1994లో భర్తతో కలసి మాధవి యూఎస్ కు వచ్చేసింది. కరోనా సోకిన వారికి సేవలందిస్తున్న అనేక మంది ఇండో–అమెరికన్ డాక్టర్లలో ఈమె కూడా ఒకరు. మాధవి లాంటి ఎందరో ప్రవాస డాక్టర్లు కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్​అందిస్తూ చనిపోతున్నారని ఇండియా సంతతి అమెరికా లీడర్స్ చెప్తున్నారు. ఇలా చనిపోయిన వారిలో ఎక్కువ శాతం న్యూయార్క్, న్యూజెర్సీకి చెందిన వారేనని తెలుస్తోంది. ఎంత మందికి కరోనా సోకిందనేది కచ్చితంగా చెప్పలేమని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్​ఫిజీషియన్స్ సెక్రటరీ రవి కోలి చెప్పారు. ఈ వారం మొదట్లోనే ప్రియా ఖన్నా (43) అనే నెఫ్రాలజిస్ట్ చనిపోగా.. ఆమె తండ్రి త్యేంద్ర ఖన్నా (78) కూడా కరోనా కారణంగా ఈమధ్యే ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం 10 మంది ఇండో అమెరికన్ డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఇండో‌‌‌‌-అమెరికన్ ఫిజీషియన్స్ రియల్​ హీరోస్ అని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్​ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గోటిముక్కుల అనుపమ చెప్పారు. కొందరు డాక్టర్లకు పాజిటివ్ అని వచ్చిందని, మరికొందరు చనిపోయారని, ఇంకొందరు ఐసీయూల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని ఆమె వాపోయింది.