22 వేల అడుగుల ఎత్తులో యోగా

22 వేల అడుగుల ఎత్తులో యోగా

ఉత్తరాఖండ్‌ : ఇండో, టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) అరుదైన రికార్డు సృష్టించారు. 22వేల 850 అడుగుల ఎత్తులో యోగా చేశారు. ఉత్తరాఖండ్‌లోని మౌంట్ అబి గామిన్ పర్వతంపై పర్వతారోహణ బృందానికి చెందిన ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు. ఈ పర్వతం దాదాపు  22, 850 అడుగుల ఎత్తు ఉంటుందని అంచనా. యోగా చేసే సమయంలో ఈ పర్వతం పూర్తిగా మంచుతో కప్పి ఉంది. ఎత్తైన పర్వతంపై మంచులో నిలబడి ‘బద్రి విశాల్ కీ జై’ అని నినాదాలతో ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు. దాదాపు 230 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ నెల 21న(జూన్ 21 ) జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అబి గామిన్ పర్వతం సెంట్రల్ హిమాలయాలలోని జస్కర్ రేంజ్‌లో ఉంటుంది. అబి గామెన్ ఈ ప్రాంతంలో ఉన్న రెండో అతిపెద్ద పర్వతం. ఇండియా, టిబెట్ సరిహద్దులు పహారా కాసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన దళమే ఐటీబీపీ. ఈ దళానికి పర్వతారోహణలోనూ మంచి పట్టు ఉంటుంది. 

మరిన్ని వార్తల కోసం..

కుక్కపై పోలీస్ కంప్లైట్

ఈ ఊళ్లో ఇండ్లన్నీ ఒకేలా ఉంటాయి..