యూట్యూబ్ లో స్టారైతే..యూనివర్శిటీలో సీటు

యూట్యూబ్ లో స్టారైతే..యూనివర్శిటీలో సీటు

జకార్తా(ఇండోనేసియా): మా యూనివర్సిటీలో చదువాలనుకుంటున్నారా? వెంటనే యూట్యూబ్ స్టార్ కండి! మినిమం 10 వేల మంది సబ్ స్క్రైబర్లను, ఒక లక్ష వ్యూస్ ను సంపాదించమంటోంది నేషనల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ వెటరన్ జకార్తా(యూపీఎన్వీజే). అప్పుడు డైరెక్టుగా యూనివర్సిటీలో సీటిచ్చేస్తామంటోంది. ఇలా స్టార్ గా మారిన వారితో మూడు నుంచి ఐదు నిమిషాల వీడియోను తయారు చేయించుకుని తర్వాత సీటిస్తామని చెబుతోంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఇండోనేసియా నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ యూనివర్సిటీల్లో సీటుకు విపరీతమైన పోటీ ఉంటుంది. సగటున ఓ ఇండోనేషియన్ రోజూ మూడు గంటల సమయాన్ని సోషల్ మీడియాపై వెచ్చిస్తున్నాడట. ఇదే యూపీఎన్వీజేను అట్రాక్ట్ చేసింది. జనాన్ని తమ వైపుకు తిప్పుకోగల యువతరానికే సీటివ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ఎకానమిక్స్, సోషల్ సైన్సెస్, పొలిటికల్ సైన్సెస్, లా, ఇంజనీరింగ్, కంప్యూటర్ కోర్సుల్లో సోషల్ మీడియా స్టార్లకు అడ్మిషన్లు ఇవ్వాలని భావిస్తోంది.