- వెల్లడించిన లింక్డ్ ఇన్ రిపోర్ట్
న్యూఢిల్లీ: లింక్డ్ ఇన్ విడుదల చేసిన 2026 టాప్ కంపెనీల లిస్ట్‌లో ఇన్ఫోసిస్ మొదటి స్థానంలో నిలిచింది. కెరీర్ వృద్ధికి అత్యుత్తమ సంస్థలుగా ఇన్ఫోసిస్ తర్వాత యాక్సెంచర్, అమెజాన్ నిలిచాయి. జేపీ మోర్గాన్, చేజ్ ఎస్ఏపీ వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది జాబితాలో ఎన్వీడియా, హెచ్‌పీ, మైక్రోసాఫ్ట్, శాన్డిస్క్, మార్వెల్ టెక్నాలజీ వంటి పది కొత్త సంస్థలు చేరాయి. దేశంలో నిపుణులకు బెంగళూరు ప్రధాన ఉపాధి కేంద్రంగా కొనసాగుతోంది.
ఆ తర్వాత హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో ఎక్కువ నియామకాలు జరుగుతున్నాయి. కేవలం సాంకేతిక నైపుణ్యాలే కాకుండా కమ్యూనికేషన్ సమస్యల పరిష్కార సామర్థ్యం వంటి మానవ నైపుణ్యాలు ఉన్న వారికే కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఏఐని సమర్థంగా ఉపయోగిస్తూనే సొంత నైపుణ్యాలను ప్రదర్శించే వారి కోసం సంస్థలు వెతుకుతున్నాయి. సాఫ్ట్వేర్, ఫైనాన్స్, కన్సల్టింగ్ రంగాలకు చెందిన కంపెనీలు ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నాయని లింక్డ్ ఇన్ తెలిపింది.

