ఓసీపీ 5 మైనింగ్‌‌ పనులపై హైకోర్టులో విచారణ

ఓసీపీ 5 మైనింగ్‌‌ పనులపై హైకోర్టులో విచారణ

గోదావరిఖని, వెలుగు:  గోదావరిఖనిలో సింగరేణి ఓపెన్‌‌ కాస్ట్‌‌ ప్రాజెక్ట్‌‌ –5లో మైనింగ్‌‌ పనులు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని సామాజిక కార్యకర్త మద్దెల దినేశ్​వేసిన పిటిషన్‌‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్విరాన్‌‌మెంట్‌‌ క్లియరెన్స్‌‌, పొల్యూషన్‌‌ కంట్రోల్‌‌ బోర్డు రూల్స్​కు విరుద్ధంగా నడిపిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన పిటిషన్‌‌లో పేర్కొన్నారు. 

అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సింగరేణి తరఫున లాయర్‌‌ వాదించారు. ఈ కేసులో డైరెక్టర్‌‌ జనరల్‌‌ ఆఫ్‌‌ మైన్స్‌‌ సేఫ్టీ(డీజీఎంఎస్‌‌)ను ఇంప్లీడ్‌‌ చేయగా వారు ఈ విషయమై విచారణ చేసి ఆగస్టు 16లోపు కౌంటర్‌‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.