భన్సాలీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ పట్టాలెక్కుతున్న ఇన్‌‌‌‌‌‌‌‌షా అల్లా స్క్రిప్ట్

భన్సాలీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ పట్టాలెక్కుతున్న ఇన్‌‌‌‌‌‌‌‌షా అల్లా స్క్రిప్ట్

‘గంగూబాయి కతియావాడి’ చిత్రంతో మెప్పించిన అలియా భట్‌‌‌‌‌‌‌‌, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో వరుస సినిమాలు రాబోతున్నాయి. ‘లవ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రం రిలీజ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతుండగా, తాజాగా మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ‘ఇన్‌‌‌‌‌‌‌‌షా అల్లా’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్‌‌‌‌‌‌‌‌ హీరోగా 2019లోనే ప్రకటించారు.

షూటింగ్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందు సల్మాన్ తప్పుకోవడంతో ఆగిపోయింది. దీంతో ఆ స్థానంలో ‘గంగూబాయి కతియావాడి’ తీసిన భన్సాలీ.. ఇన్నేళ్ల తర్వాత ‘ఇన్‌‌‌‌‌‌‌‌షా అల్లా’ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.

అప్పటి స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌ను యాథాతథంగా కాకుండా స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌లో చాలానే మార్పులు జరుగుతున్నాయట. బహుశా అలియా పాత్రకు మరింత ప్రాధానత్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక సల్మాన్ పాత్రను షారుఖ్‌‌‌‌‌‌‌‌తో రీప్లేస్‌‌‌‌‌‌‌‌ చేయబోతున్నట్టు ఈ ఏడాది ప్రారంభంలో వార్తలొచ్చినా  అదంతా ప్రచారానికే పరిమితమైంది.

దీంతో ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.  ఏదేమైన స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ డ్రాప్ట్‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యాకే ఇతర నటీనటులను ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారట భన్సాలీ.  ‘లవ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రం జనవరిలో విడుదల కానుండగా ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌పై మరింత క్లారిటీ రానుంది.