అమెరికా రాజకీయ, టెక్ వర్గాల్లో వైట్‌హౌస్ వేదికగా జరిగిన ఒక సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు, భద్రతకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక సమావేశం జరిగింది. ఈ భేటీలో టెక్ దిగ్గజాలు పాల్గొనగా.. సమావేశంలో జరిగిన సరదా సంభాషణలు అందరినీ ఆకర్షించాయి. ముఖ్యంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయం వైరల్ అవుతున్నాయి.
సమావేశంలో సుందర్ పిచాయ్ మాట్లాడేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. ట్రంప్ ఆయనను ఉద్దేశించి సరదాగా "ఈ వ్యక్తి ఒక మాన్స్టర్, ఎవరికీ తెలియకుండా ఇతను గొప్ప జీవితాన్ని గడుపుతున్నాడు" అంటూ కామెంట్ చేశారు. అయితే ఆ తర్వాత వెంటనే స్పందిస్తూ తాను పిచాయ్ సాధించిన అద్భుతమైన విజయాన్ని, ఆయన ఎదుగుదలను ఉద్దేశించే ఆ మాట అన్నానని వివరణ ఇచ్చారు. దీనికి స్పందించిన సుందర్ పిచాయ్.. "నేను ఒక మాన్స్టర్ అనే ట్యాగ్‌లైన్ కంటే మంచి ట్యాగ్‌లైన్ వస్తుందని ఆశిస్తున్నాను" అంటూ చమత్కారంగా బదులిచ్చారు.
Trump: This guy (Sundar Pichai) is a monster, and nobody knows him. What a great life! To be a Monster and not have to go through this. All you have to know is — sundarr! Sundar is his name. https://t.co/smlS58lQdW
— Nicholas Mugalli (@RealNickMugalli) September 29, 2026
దీని వెనుక AI రంగానికి సంబంధించిన ఒక అత్యంత గంభీరమైన అంశం దాగి ఉంది. అమెరికా అంతటా ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు కోసం వందలాది బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తుండగా.. దీనిపై అధికార రిపబ్లికన్ పార్టీ, అలాగే ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీల నుండి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏఐ భద్రతపై ఆందోళనలను పరిష్కరించేందుకు ట్రంప్, హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ప్రముఖ టెక్ కంపెనీల అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ప్రముఖ ఏఐ కంపెనీలైన ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఓపెన్‌ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మాన్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఎక్స్ఏఐ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. కంపెనీలు అంతర్గత నియంత్రణలను పటిష్టం చేసుకోవడంతో పాటు, ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ ఆడిటర్లచే తనిఖీలు చేయించుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ నిబంధనలను చట్టాలుగా మార్చే అవకాశం కూడా ఉందని ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది.
ALSO READ : బిగ్ బ్రేకింగ్.. ఫారం 6 రూల్స్ మార్చిన EC..
ఏఐ టెక్నాలజీ అద్భుతమైన ఆర్థిక వృద్ధిని తెస్తుందని ట్రంప్ ప్రశంసించగా.. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ మాత్రం ఈ సాంకేతికతలో వాస్తవమైన రిస్క్‌లు ఉన్నాయని హెచ్చరించారు. ఈ మొత్తం పరిణామం టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీసింది.
