అశ్వారావుపేట ఆర్టీసీ కాంప్లెక్స్ తనిఖీ.. పలు షాపులకు ఫైన్లు

అశ్వారావుపేట ఆర్టీసీ కాంప్లెక్స్ తనిఖీ.. పలు షాపులకు ఫైన్లు

అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఉన్న పలు షాపులను సత్తుపల్లి ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ పి. విజయ శ్రీ శనివారం తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ లో బాత్రూమ్​లో అపరిశుభ్రంగా ఉండటంతో నిర్వాహకురాలని పిలిచి మందలించి రూ. 1000 ఫైన్ వేసి రసీదును అందజేశారు. అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్న ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఆర్టీసీ నిర్దేశించిన స్థలం కంటే కొంత భాగాన్ని ఆక్రమించి టీ స్టాల్ ఏర్పాటు చేయటంతో షాపు యజమానికి రూ .1000 ఫైన్ వేశారు. 

బస్టాండ్ ఆవరణంలో సైకిల్ స్టాండ్ లో వాహనాలకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణతో సైకిల్ స్టాండ్ తనిఖీ చేసి నిర్వాహకుడికి రూ .1000 ఫైన్ వేశారు. నిబంధనలు అతిక్రమించిన షాపులకు పనిష్మెంట్ ఉంటుందని ఆర్టీసీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం నడుచుకోవాలని షాపు యజమానులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ అప్పారావు, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ రాముడు పాల్గొన్నారు.