ఇన్‌స్టా యాప్‌ వాడాలంటే ప్రొఫైల్‌లో బర్త్‌ డేట్‌ తప్పనిసరి!

ఇన్‌స్టా యాప్‌ వాడాలంటే ప్రొఫైల్‌లో బర్త్‌ డేట్‌ తప్పనిసరి!

ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ వాడుతున్నారా? అందులో మీ డేట్‌ ఆఫ్ బర్త్ అప్‌డేట్ చేశారా? చేయకుంటే రానున్న రోజుల్లో మీరు ఈ యాప్‌ను వాడలేరు. ఇప్పటికే ఇన్‌స్టా ప్రొఫైల్‌లో పుట్టిన రోజు డేట్‌ లేకుంటే పాప్‌అప్‌ వస్తోంది. యాడ్ యువర్ బర్త్‌ డే అంటూ ప్రాంప్ట్ చూపిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్‌ను నాట్‌ నవ్‌ అంటూ స్కిప్‌ చేసే అవకాశం ఇస్తోంది ఇన్‌స్టా. కానీ రానున్న రోజుల్లో బర్త్ డేట్‌ అప్‌డేట్‌ చేయకుంటే యాప్‌ను వాడేందకు వీలు లేకుండా బ్లాక్‌ చేస్తుంది. వయసును బట్టి యాప్‌లో వచ్చే కంటెంట్‌ను చూపించడం, బ్లాక్ చేయడం చేసేందుకు డేట్‌ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడం తప్పనిసరి కండిషన్‌ పెట్టబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ యూత్ ప్రాడక్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్ పావనీ దివాన్‌జీ తెలిపారు. ఇన్‌స్టా యాప్‌ను మరింత సేఫ్‌గా మార్చడం కోసం యూజ్‌ వయసు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే బర్త్‌ డేను షేర్‌‌ చేయాల్సిందిగా అడుగుతూ పాప్‌అప్‌ ఇస్తున్నామన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలో రెండు కొత్త మార్పులు చేసేందుకు ప్రిపేర్‌‌ చేస్తున్నామని బ్లాగ్‌లో పేర్కొన్నారు. 

ఏ వయసు వారికి ఎలాంటి కంటెంట్ చూపించాలన్నదానిపై క్లారిటీ కోసమే యూజర్లను డేట్‌ ఆఫ్ బర్త్ అడుగుతున్నామని పావని చెప్పారు. యాప్ ఓపెన్ చేసినప్పుడు ఈ పాప్అప్‌ కనిపిస్తుందని, ఆ వివరాలు సబ్మిట్‌ చేసే వరకూ ఇది కొనసాగుతుందని అన్నారు. ఏదైనా హింసాత్మకమైన, సెన్సిటివ్, అబ్యూసివ్ పోస్టులు ఉంటే వాటి కవర్ తొలగించాలని యూజర్‌‌ క్లిక్ చేసిన సమయంలో కూడా డేట్‌ ఆఫ్ బర్త్ అప్‌డేట్‌ చేయాలని సూచిస్తూ పాప్‌అప్‌ వస్తుందన్నారు.