చంద్రయాన్‌‌‌‌ 3కి ఇన్సూరెన్స్‌‌‌‌!

చంద్రయాన్‌‌‌‌ 3కి ఇన్సూరెన్స్‌‌‌‌!

ఇండియా శాటిలైట్లను పంపడం స్టార్ట్‌‌‌‌ చేసి నాలుగున్నర దశాబ్దాలవుతోంది. ఆర్యభట్టతో ఆ ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ శాటిలైట్‌‌‌‌కు కూడా ఇస్రో ఇన్సూరెన్స్‌‌‌‌ చేయించలేదు. వేరే దేశాల నుంచి లాంచ్‌‌‌‌ చేసిన వాటికే బీమా చేయించింది. అది కూడా అక్కడి నిబంధనల ప్రకారం జరిగింది. శాటిలైట్ల లాంచింగ్‌‌‌‌  మొదలుపెట్టినప్పటి నుంచి అగ్గితో చెలగాటమాడుతున్న ఇస్రో.. కొన్నిసార్లు చేయి కూడా కాల్చుకుంది. ఈ మధ్య చంద్రయాన్‌‌‌‌ 2కు ల్యాండర్‌‌‌‌ విఫలమైన అనుభవంతో 2020లో లాంచ్‌‌‌‌ చేయబోతున్న చంద్రయాన్‌‌‌‌ 3కి ఇన్సూరెన్స్‌‌‌‌ చేయించాలనుకుంటోంది.

ఇప్పటివరకు ఎందుకు చేయించలె?

ఇస్రో ఇంతవరకు శాటిలైట్లకు ఎందుకు ఇన్సూరెన్స్‌‌‌‌ చేయించలేదు.. దానికయ్యే ఖర్చు చాలా ఎక్కువ కాబట్టే. ప్రాజెక్టు ఖర్చులో 20 నుంచి 25 శాతం ప్రీమియం కట్టాలి. అంటే చంద్రయాన్‌‌‌‌ 2కి ఇన్సూరెన్స్‌‌‌‌ ఖర్చే రూ.195 కోట్ల నుంచి రూ.244 కోట్లు ఉంటుందన్నమాట. మరో విషయమేంటంటే.. దేశంలో శాటిలైట్లకు బీమా చేసే ఒకే ఒక కంపెనీ న్యూ ఇండియా అష్యూరెన్స్‌‌‌‌. దీన్ని సర్కారే నడిపిస్తోంది. ఇక్కడ ప్రాజెక్టులను ఇన్సూర్‌‌‌‌ చేయిస్తే ‘ఆ ఖర్చు, ఈ ఖర్చు’ అంతా కలిపి ప్రజలపైనే పడుతుంది. అందుకే ఇస్రో ఆచితూచి అడుగేస్తుంటుంది. కానీ కొన్నిసార్లు ఇన్సూరెన్స్‌‌‌‌ మేలు కూడా చేస్తుంటుంది. 1997లో లాంచ్‌‌‌‌ చేసిన ఇన్‌‌‌‌శాట్‌‌‌‌ 2డీ ఫెయిలయింది. దానికి ఇస్రో బీమా చేయించడంతో ఫ్రెంచ్‌‌‌‌ గయానా రూ.240 కోట్ల పరిహారం అందించింది.

12 ఫెయిల్యూర్స్‌‌‌‌

ఇస్రో చరిత్రలో ఇప్పటివరకు 12 ఫెయిల్యూర్స్‌‌‌‌ ఉన్నాయి. వీటిలో కొన్ని లాంచ్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లోనే జరిగాయి. ఉదాహరణకు 2006లో ఇన్‌‌‌‌శాట్‌‌‌‌ 4సీ వెళ్లి బంగాళాఖాతంలో పడింది. దాని ఖర్చు రూ.400 కోట్లు. 2013లో విజయవంతమైన మంగళ్‌‌‌‌యాన్‌‌‌‌ కూడా ఇన్సూరెన్స్‌‌‌‌ లేకుండానే చేశారు. అది ఫెయిలై ఉంటే రూ.447 కోట్లు నష్టపోయేవాళ్లం.

చంద్రయాన్‌‌‌‌ 2 లోక్‌‌‌‌సభలో చర్చ

చంద్రయాన్‌‌‌‌ 2పై లోక్‌‌‌‌సభలో బుధవారం చర్చ జరిగింది. ఆ ప్రయోగంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. రెండు దశల్లో చంద్రయాన్‌‌‌‌ 2 విక్రమ్ ల్యాండర్‌‌‌‌ను దింపే ప్రయోగం జరిగిందని, తొలి దశలో చంద్రుని ఉపరితలంపై 30 కిలోమీటర్ల నుంచి 7.4 కిలోమీటర్ల కిందివరకు ప్రయోగం బాగా జరిగిందని వివరించారు. వేగాన్ని సెకనుకు 1,683 మీటర్ల నుంచి సెకనుకు 146 మీటర్లకు తగ్గించామని చెప్పారు. రెండో దశలో ల్యాండర్‌‌‌‌ వేగం అనుకున్నదానికన్నా ఎక్కువ తగ్గిందని, దీంతో నియంత్రణ కోల్పోయి ల్యాండింగ్‌‌‌‌కు ఇంకా 500 మీటర్ల దూరం ఉందనుకున్న టైంలో క్రాష్‌‌‌‌ ల్యాండింగ్‌‌‌‌ జరిగిందన్నారు.

ఇస్రో గత 5 ఫెయిల్యూర్స్‌‌‌‌

ఐఆర్‌‌‌‌ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌
1హెచ్‌‌‌‌                         రూ.280 కోట్లు

జీశాట్‌‌‌‌ 5పీ                   రూ.325 కోట్లు

జీశాట్‌‌‌‌ 4                     రూ.325 కోట్లు

ఇన్‌‌‌‌శాట్‌‌‌‌ 4సీ                రూ.256 కోట్లు