కరోనాకు ఇన్సూరెన్స్‌ కావాలి

కరోనాకు ఇన్సూరెన్స్‌ కావాలి

ఆర్థిక మంత్రిని కోరిన సీఏఐటీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌‌‌‌ ఔట్‌‌‌‌ బ్రేక్ వలన నష్టపోయిన వ్యాపారాలకు ఇన్సూరెన్స్‌ కవరేజిని అందించాలని వ్యాపార సంఘాల నాయకులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ను కోరారు. ఈ కవరేజిని తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌ కంపెనీలు అందించే విధంగా రెగ్యులేటరీ సంస్థ ఐఆర్‌‌‌‌‌‌‌‌డీఏఐ చర్యలు తీసుకోవాలని, దీని కోసం ఐఆర్‌‌‌‌‌‌‌‌డీఏఐని ఆర్థిక శాఖ ఆదేశించాలని సీతారామన్‌‌కు రాసిన లేఖలో సీఏఐటీ పేర్కొంది. దోమల లేదా ఇతర జీవుల నుంచి వ్యాప్తి చెందే వ్యాధులకు కవరేజి అందించే పాలసీలను ఇన్సూరెన్స్‌ కంపెనీలు తీసుకురావాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌‌‌‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ అన్నారు. ఈ విషయాన్నే సైట్‌‌‌‌ కామర్స్‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ పీయుష్‌ గోయల్‌ దృష్టికి కూడా తీసుకెళ్లింది.

For More News..

ఏప్రిల్‌ ఒకటి తర్వాత ఆ బండ్లన్నీ స్క్రాపే

కరోనాపై ఇండియన్ డాక్టర్ల ముందడుగు

మహేశ్ కాదన్న సినిమా.. పవన్ చేస్తున్నాడా?