
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు వంద రూపాయలు ఇవ్వలేదని మైనర్ విద్యార్థిని చున్నితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి వచ్చిన రామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతి చెందిన బాలిక వేదశ్రీ (17) గా గుర్తించారు. విద్యార్థిని ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు వెల్లడించారు.