
చిట్యాల, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లో ఇంటర్స్టూడెంట్మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చిట్యాల మండలంలోని నైన్పాకకు చెందిన పెండెల స్వామి, రమ బతుకుదెరువు కోసం హనుమకొండ వెళ్లారు. అక్కడే ఉంటూ వాచ్మన్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు బన్నీ(18) నైన్పాకలోని నాయనమ్మ వద్ద ఉంటూ చిల్యాల గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. బన్నీ సోమవారం హనుమకొండ వెళ్తానని వరుసకు అన్నలైన పెండెల శ్రీధర్, సన్నీలకు చెప్పాడు. దాంతో బన్నీని మోరంచపల్లి వద్ద బస్సు ఎక్కించేందుకు బైక్పై బయల్దేరారు. జడల్పేట శివారులోని టర్నింగ్వద్ద బైక్ అదుపు తప్పడంతో కిందపడిపపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురికీ తీవ్ర గాయాలవ్వగా బన్నీ అక్కడికక్కడే మృతి చెందాడు. సన్నీ, శ్రీధర్పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్చేశారు.