మేం ఎవరితో చెప్పుకోవాలి : రూ.25 లక్షల జీతం సరిపోవట్లేదంట.. ఇదిగో ఖర్చుల లెక్క

మేం ఎవరితో చెప్పుకోవాలి : రూ.25 లక్షల జీతం సరిపోవట్లేదంట.. ఇదిగో ఖర్చుల లెక్క

సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన పోస్ట్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అది ఏంటంటే? అతడికి  సంవత్సరానికి రూ.25 లక్షల  జీతం వస్తున్నా సరిపోవట్లేదంటా? మీరు విన్నది నిజమేనండి బాబు..ముగ్గురు వ్యక్తులున్న అతడి ఫ్యామిలీకి రూ. 25 లక్షలు అస్సలు సరిపోతలేదంట.. బతకడం చాలా కష్టమవుతోందని.. ట్విట్టర్లో పోస్ట్ చేశాడు  సౌరబ్ దత్తా అనే వ్యక్తి.

 నిత్యావసరాలు, ఈఎంఐలు, వైద్యం, అత్యవసర పరిస్థితులపై నెలవారీ ఖర్చుల తర్వాత పెట్టుబడి పెట్టడానికి లేదా పొదుపు చేయడానికి డబ్బు  ఏమి మిగలడం లేదంటున్నాడు. అంతేకాదు నెలవారీగా అతను దేనికి ఎంత ఖర్చు చేస్తున్నాడో లెక్కలు చెబుతున్నాడు. అతడి లెక్కలేంటో ఒక్కసారి చూద్దాం...

  • సంవత్సరానికి సంపాదన రూ.25 లక్షలు
  • చేతికి వచ్చేది నెలకు రూ. లక్షన్నర
  • 3 మంది ఉన్న కుటుంబానికి నిత్యావసరాలు, EMI /  గది అద్దెకు నెలకు లక్ష  ఖర్చు
  • భోజనం, సినిమాలు, OTT, రోజు పర్యటనల కోసం నెలకు రూ. 25 వేలు
  • అత్యవసరం.. వైద్యం కోసం నెలకు రూ 25 వేలు
  • ఇక పెట్టుపెట్టడానికి ఏమి మిగలడం లేదు

ఈ పోస్ట్ పై సోషల్ మీడియాలో పలువురు భిన్న రకాలుగా కామెంట్ చేస్తున్నారు. రూ..25లక్షలు సరిపోతాయని కొందరు..సరిపోవని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం మంది అతడి పోస్ట్ ను వ్యతిరేకిస్తున్నారు. సంవత్సరానికి 25 లక్షలు సంపాదిస్తేనే సరిపోవట్లేదంటే.. 5 లక్షల లోపు..10 లక్షల లోపు  సంపాదించే వారి పరిస్థితి ఏంటని  ప్రశ్నిస్తున్నారు. 

 అనవసరమైన ఖర్చులు తగ్గించి అవసరమైన ఖర్చులు పెడితే బెటరని అతడికి సూచిస్తున్నారు.  ఇష్టానుసారంగా ఖర్చు పెడితే... ఎంత సంపాదించిన సరిపోవని చెబుతున్నారు నెటిజన్లు. అతను..  నెలవారీ లెక్కలు తప్పుగా  చూపించారని.. ఇష్టానుసారంగా లెక్కలు వేశారని  మరో  నెటిజన్ కామెంట్ చేశాడు. 

మన దేశంలో సంవత్సరానికి  ఐదు లక్షల లోపు  సంపాదించే వారే ఎక్కువ శాతం  ఉంటారు. అంటే వీరి జీతం నెలకు 50 వేల లోపే అన్నమాట. మరి వీరి పరిస్థితి ఏంటి? అని కామెంట్ చేస్తున్నారు.