బ్రిజ్ భూషణ్‌‌పై విచారణకు కమిటీ

బ్రిజ్ భూషణ్‌‌పై విచారణకు కమిటీ
  • మేరీకోమ్‌‌ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఐవోఏ

న్యూఢిల్లీ: రెజ్లింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా (డబ్ల్యూఎఫ్​ఐ) ప్రెసిడెంట్​ బ్రిజ్​ భూషణ్​ శరణ్​ సింగ్​పై వచ్చిన లైంగిక ఆరోపణలను విచారించేందుకు ఇండియన్​ ఒలింపిక్​ అసోసియేషన్​ (ఐవోఏ) ఏడుగురితో కమిటీ వేసింది. మేరీకోమ్​ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో యోగేశ్వర్​ దత్​, డోలా బెనర్జీ, సహదేవ్​ యాదవ్​, అలక్​నందా అశోక్, ​​నీలాంజన్​ భట్టాచార్య (అడ్వకేట్​)ఉన్నారు. శుక్రవారం అత్యవసరంగా సమావేశమైన ఐవోఏ ఎగ్జిక్యూటివ్​ కౌన్సిల్​ఈ నిర్ణయం తీసుకుంది. ప్రెసిడెంట్​ పీటీ ఉష, జాయింట్​ సెక్రటరీ కళ్యాణ్​ చౌబేతో పాటు అభినవ్​ బింద్రా, యోగేశ్వర్​ ఈ మీటింగ్​కు హాజరయ్యారు. అయితే కమిటీ ఎప్పటిలోగా విచారణ పూర్తి చేయాలన్న దానిపై ఎలాంటి గడువును నిర్దేశించలేదు. ప్రస్తుతానికి బ్రిజ్​ భూషణ్​, రెజ్లర్ల మధ్య నడుస్తున్న  గొడవకు ఫుల్​స్టాప్​ పెట్టి, ధర్నాను విరమించేందుకు కమిటీ ప్రయత్నించనుంది. తాము ప్రతి ఒక్కరి వాదనలను వింటామని, పక్షపాతం లేకుండా నిర్ణయాలు తీసుకుంటామని వెయిట్​ లిఫ్టింగ్​ ఫెడరేషన్​ ప్రెసిడెంట్​ సహదేవ్​ యాదవ్​ స్పష్టం చేశాడు. వేధింపులకు గురైన ప్లేయర్ల పేరు చెబితే.. కమిటీ ప్రత్యక్షంగా వాళ్లను కలువనుంది. అయితే వీటిని రహస్యంగా ఉంచనున్నారు. అన్ని అంశాలను కమిటీ పూర్తి స్థాయిలో విచారించి న్యాయం చేస్తుందని ఉష రెజ్లర్లకు హామీ ఇచ్చింది. 

నేను దిగను: బ్రిజ్​

మరోవైపు తాను ప్రెసిడెంట్​ పోస్ట్​కు రాజీనామా చేసే ప్రసక్తే లేదని బ్రిజ్​ భూషణ్​ స్పష్టం చేశాడు. తనకు ఈ పదవి ఎవరి దయతో రాలేదని ఘాటుగా స్పందించాడు. రెజ్లర్ల ధర్నా వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందన్న బ్రిజ్‌‌.. దీన్ని  షహీన్‌‌ భాగ్‌‌ నిరసనలతో పోల్చాడు. ‘అన్ని అంశాలను పబ్లిక్​లోకి తీసుకొస్తే భూకంపం వస్తుందని రెజ్లర్లు చెబుతున్నారు. కానీ నేను నోరు విప్పితే సునామీ వస్తుంది’ అని బ్రిజ్ భూషణ్​​ వ్యాఖ్యానించాడు.