అమెరికాతో మాటల్లేవ్: ఇరాన్ ప్రెసిడెంట్

అమెరికాతో మాటల్లేవ్: ఇరాన్ ప్రెసిడెంట్

సుప్రీం లీడర్ పై ఆంక్షలను ఖండించిన ఇరాన్

టెహ్రాన్(ఇరాన్): అమెరికాతో ఇక మాటల్లేవని ఇరాన్ ప్రకటించింది. దేశ పెద్దపై ఆంక్షలు వేయడమంటే ‘చర్చ’లకు దారులను పూర్తిగా మూసేసినట్లేనని పేర్కొంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమెనీతో పాటు కమాండర్లు, జనరల్స్ పై అమెరికా ఆంక్షలు వేసిన సంగతి తెలిసిందే. ఈ వారంలోగా ఇరాన్ విదేశాంగ మంత్రిపైనా ఆంక్షలు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. అమెరికా పనులను ఇరాన్ ప్రెసిడెంట్ హసన్ రౌహాని దిక్కుమాలిన చర్యగా అభివర్ణించారు. ఓ వైపు చర్చలకు రమ్మంటూనే, మరోవైపు వచ్చే దారిని అమెరికా మూసేస్తుందని విమర్శించారు.

మళ్లీ దాడి చేస్తే ఊరుకోం

ఇరాన్ మళ్లీ దాడికి పాల్పడితే ఈసారి అమెరికా ఎట్టి పరిస్థితుల్లో సహించదని ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. దాడులకు తగిన సమాధానమిస్తామన్నారు.