తీర్థయాత్రల కోసం ప్రత్యేక రైళ్లు, ప్యాకేజీలు

తీర్థయాత్రల కోసం ప్రత్యేక రైళ్లు,  ప్యాకేజీలు

యాదాద్రి, వెలుగు : తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజల కోసం జూన్ 14 నుంచి జూలై 13 వరకు రెండు ప్రత్యేక ప్యాకేజీలను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డీఎస్జీపీ కిశోర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్యాకేజీ–1లో భాగంగా వారణాసి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగరాజ్, శృంగవర్పూర్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ యాత్ర జూన్ 14న ప్రారంభమై 22 వరకు కొనసాగుతుంది..

 ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ.16,200, 3 ఏసీ ధర రూ.26,500, 2 ఏసీ ధర రూ.35,000గా నిర్ణయించారు. ఇక ప్యాకేజీ–2లో భాగంగా మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, ఘృష్ణేశ్వర్, ఎల్లోరా, మోవ్, నాగ్పూర్ ప్రాంతాలు ఉన్నాయి.ఈ యాత్ర జూలై 5న ప్రారంభమై 13 వరకు కొనసాగుతుంది. ఒక్కొక్కరికి సాధారణ టికెట్ ధర రూ.14,700, 3 ఏసీ ధర రూ.22,900, 2 ఏసీ ధర రూ.29,900గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం 9701360701, 9281030712, 9281495845, 9281030749, 9281030750 నంబర్లను  సంప్రదించాలని సూచించారు.