మేళ్లచెరువు(హుజూర్ నగర్ ), వెలుగు : సూర్యాపేట జిల్లాలో నేడు పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ పీఆర్వో వెంకటరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం గ్రామం వద్ద ఎన్ఎస్పీ కాల్వ, రెడ్లకుంట మేజర్ కు పడ్డ గండికి కొనసాగుతున్న మరమ్మతు పనులను మంత్రి పరిశీలించనున్నట్లు తెలిపారు.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో కరక్కాయలగూడెం గ్రామ సమీపంలో ముక్త్యాల మేజర్ కాలువ గండి, మఠంపల్లి మండలం తెగిపోయిన చౌటపల్లి చెరువు కట్ట మరమ్మతు పనులను ఆయన పరిశీలిస్తారని పేర్కొన్నారు.