నల్లబెల్లి, వెలుగు: ఎస్ఆర్ఎస్పీ డీబీఎం 38 కెనాల్ భూములపై ఇరిగేషన్సోమవారం సర్వే చేపట్టారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల సమీపంలో బీఆర్ఎస్లీడర్లు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని నల్లబెల్లికి చెందిన లీడర్లు ఇరిగేషన్ ఆఫీస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ డీఈ రవీందర్తో పాటు కెనాల్కట్ట, భూములను పరిశీలించారు. కెనాల్ భూమి, కట్టకు సంబంధించిన మ్యాప్ తో సర్వే చేపట్టారు.
కట్టా భూములను అక్రమించుకొని ఇడ్లు నిర్మాణాలు చేపడుతున్నట్లు సర్వేలో తేలింది. ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారికి గతంలో నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే క్రమినలు కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఈ పవిత్ర, రెవెన్యూ ఆఫీసర్లు, లీడర్లు పాల్గొన్నారు.
