కీటో డైట్ తో ప్రమాదమా?.అసలు కీటో డైట్ అంటే ఏంటి?

కీటో డైట్ తో  ప్రమాదమా?.అసలు కీటో డైట్ అంటే ఏంటి?

మిస్తీ  ముఖర్జీ. పదేళ్లపాటు  ప్రేక్షకులను అలరించిన నటి. ఇటీవల కిడ్నీ డిసీజ్​తో చనిపోయింది. కానీ, మిస్తీ కిడ్నీ  ఫెయిల్ అవ్వడానికి కారణం ఈ మధ్య వెయిట్ లాస్ లో బాగా పాపులర్ అయిన కీటో డైట్ పాటించడమే అని అంటున్నారు. దీంతో కీటో డైట్ తో మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా..? అనే డౌట్స్ ఇప్పుడు చాలామందిలో ఉన్నాయ్.

డ్యా న్సర్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా మిస్తీ ముఖర్జీ పాపులర్. 2012లో ఆమె బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి ఇప్పటివరకూ హిందీ, బెంగాలి, సౌత్ ఇండియా ఫిల్మ్స్ లో నటించారు. మ్యూజికల్ వీడియోస్ కూడా చేయడంతో ఆమె బాగా పాపులర్ అయ్యారు. అయితే గత రెండు నెలలుగా మిస్తీ.. కిడ్నీ సమస్యలతో సఫర్ అయ్యారు. ట్రీట్​మెంట్ తీసుకుంటూ చనిపోయే ముందు వరకూ మస్తీ  కీటో డైట్​ను సీరియస్​గా ఫాలో అయ్యారని..  దానివల్లే కిడ్నీ ఫెయిలైందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బలమైన ఆహారం తీసుకోకపోవడం వల్లే ఆమె కిడ్నీ ఫెయిలై ఉంటుందని అంటున్నారు.

కీటో డైట్ అంటే..

వెయిట్ లాస్ అవడానికి మనం చాలా రకాల డైట్​ల గురించి విన్నాం. కానీ ఈ మధ్య బాగా పాపులరైన డైట్.. కీటో డైట్.  సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యులవరకూ చాలామంది బరువును తగ్గించుకోవడానికి ఈ డైట్ ఫాలో అవుతున్నారు. కీటో డైట్ అంటే కీటో జెనిక్ ఫుడ్ అని అర్థం. ఈ డైట్ తీసుకుంటే కొవ్వు దానంతట అదే కరిగిపోతుంది. ఈ డైట్ ఫాలో అయితే బరువు తగ్గి స్లిమ్ గా తయారవుతారు.  దీనివల్లే ఈ మధ్య కీటోడైట్ బాగా పాపులర్ అయింది.

ఇది నిజంగానే సేఫ్ కాదా..

కీటో డైట్ తో బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో ..సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. కీటో డైట్​లో కార్బొహైడ్రేట్ ఫుడ్ ను పూర్తిగా తొలగిస్తారు. దీంతో బాడీలో ఉండే కొవ్వే కరుగుతుంది తప్ప అదనంగా కొవ్వు ఏర్పడే ఛాన్స్ లేదు. దీనివల్ల నెమ్మది నెమ్మదిగా వెయిట్ లాస్ అవుతారు. కాని కొంతమంది డాక్టర్లు మాత్రం ఈ డైట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తున్నారు. ఈ డైట్ స్టార్ట్ చేసిన మొదట్లోనే కీటో ఫ్లూసమస్యలు రావడం,   అలసట.. నీరసం పెరుగుతాయని చెప్తున్నారు. హార్ట్ బీట్ లో కూడా మార్పులు కనిపిస్తాయట.   లో డైట్ వల్ల కొన్ని అవయవాలపై ఎఫెక్ట్ పడే చాన్స్ కూడా ఉంది.

ఏం చేయాలి?

సాధారణంగా బరువు తగ్గడానికి కీటోజెనిక్ డైట్ మంచిదే. కానీ దాని సరిగ్గా ఫాలో కాకపోయినా.. ఎక్కువ ఫాలో అయినా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్.. డైట్ ప్రారంభించిన మొదటి వారంలోనే కనిపిస్తాయి. సో.. ఈ డైట్ మొదలుపెట్టిన రెండు వారాల వరకూ కార్బొహైడ్రేడ్స్ ఉన్న ఆహారం తీసుకుంటే బెటర్. అలాగే.. ఈ డైట్ మొదలుపెట్టేముందు జనరల్ ఫిజీషియన్ సలహా తీసుకుని చేస్తే మంచిది. దీనివల్ల శరీరం ఈ డైట్ కు సెట్ అవుతుందో లేదో ముందే తెలుస్తుంది.