పాకిస్థాన్ అణువణువూ పసిగట్టే ఇస్రో శాటిలైట్లు

పాకిస్థాన్ అణువణువూ పసిగట్టే ఇస్రో శాటిలైట్లు

ఢిల్లీ : పాకిస్థాన్ కు సంబంధించిన భూభాగాలపై అత్యంత కీలకమైన సమాచారం సేకరించడంలో భారత త్రివిధ దళాలకు ఇస్రో ఉపగ్రహాలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఫిబ్రవరి 26 మంగళవారం నాడు చేసిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లోనూ.. ఇస్రో శాటిలైట్స్ అందించిన సహకారం చాలా గొప్పది. పాకిస్థాన్ లోని మొత్తం భూభాగంలో 87శాతం ప్రాంతాన్ని ఇస్రో కార్టొశాట్ ఉపగ్రహాలు హై డెఫినిషన్(HD)లో ఫొటోలు, వీడియోలు తీయగలవు. పాకిస్థాన్ లో 8.8లక్షల చదరపు కిలోమీటర్ల ల్యాండ్ ఉంది. ఇందులో 7.7 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో.. అణువణువునా ఏముందో చెప్పేయగల సత్తా ఇస్రో సొంతం. 0.65 మీటర్ల రెజల్యూషన్ తో ఫొటోలు తీసి పంపగలవు ఇస్రో ఉపగ్రహాలు. ఈ ఫొటోలు.. సైన్యానికి చాలా ఉపయోగపడుతున్నాయి.

చైనా మినహా… మొత్తం 14 దేశాలకు సంబంధించిన 5.5 మిలియన్ కిలోమీటర్ల భూభాగాన్ని ఇస్రో ఉపగ్రహాలు ఫోకస్ చేయగలవు. పాకిస్థాన్ సరిహద్దులోని ప్రతి ఇల్లు, గదులు, వరండాలను ఇండియా ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ తో స్పష్టంగాచూడొచ్చని.. మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఇండియాకు అవసరమైన ఉపగ్రహాలను 70శాతం సమకూర్చుకున్నామని ఇస్రో అధికారులు చెప్పారు.

కార్టొశాట్ శాటిలైట్ సిరీస్, జీశాట్ 7, జీశాట్ 7ఓ, ఐఆర్ఎన్ఎస్ఎస్, మైక్రోశాట్, రిసాట్, HysIS ఇండియన్ ఆర్ముడ్ ఫోర్సెస్ కు కీలకమైన సమాచారం అందిస్తున్నాయి.

  • 2018 నవంబర్ 28న పీఎస్ఎల్వీ సీ 43 రాకెట్ తో… హైపర్ స్పెక్ట్రాల్ ఇమేజింగ్ శాటిలైట్ ను ఇస్రో కక్ష్యలోకి పంపింది. ఇది భూమిలోకి కొన్ని సెంటీమీటర్ల లోతువరకు పరిశీలించి చూడగలదు. ల్యాండ్ మైన్స్, ఐఈడీలను పసిగట్టి చూపుతుంది.
  • IRNSS కాన్ స్టెలేషన్ : కక్ష్యలో 7 ఉపగ్రహాలున్నాయి. సరిహద్దులో 16వందల కిలోమీటర్ల భూమిపై నిఘా పెట్టగలవు. మిసైల్స్ ఎవరైనా లాంచ్ చేస్తే.. సైన్యానికి సంకేతాలు పంపుతాయి.
  • కార్టొశాట్ ఫ్యామిలీ : ఇది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. మిలటరీ కోసం ఐదు ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. 2005లో తొలిసారి.. 2017లో చివరిసారి ఈ ఉపగ్రహాన్ని లాంచ్ చేశారు. ఎక్కడ కావాలంటే అక్కడి స్పష్టమైన ఫొటోలను ఈ కార్టొశాట్ ఫ్యామిలీ ఉపగ్రహం పంపుతుంది.
  • జీశాట్ 7 ఏ… జీఎస్ఎల్వీ ఎఫ్ 11 :  2018 డిసెంబర్ 19న జరిపారు ఈ ప్రయోగాన్ని. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన రెండో కమ్యూనికేషన్ శాటిలైట్ ఇది. రాడార్ లను ఇంటర్ లింక్ చేస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్, వెసెల్స్ ను గుర్తిస్తుంది. విమానానికి విమానానికి మధ్య ఎయిర్-ఎయిర్, ఎయిర్-గ్రౌండ్ కమ్యూనికేషన్ అందిస్తుంది. డ్రోన్లు… వీడియోలు, ఫొటోలు తీసుకోవడానికి సహకరిస్తుంది.

2016 సెప్టెంబర్ లో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ లోనూ కార్టొశాట్ ఫ్యామిలీ శాటిలైట్లు వాయుసేనకు బాగా ఉపయోగపడ్డాయి.