చిన్న సిటీల్లోనూ క్యాంపస్​ రిక్రూట్​మెంట్లు

చిన్న సిటీల్లోనూ క్యాంపస్​ రిక్రూట్​మెంట్లు
  • కొన్ని కంపెనీల్లో ఇంక్రిమెంట్ల విధానాల్లో మార్పులు
  • ఖర్చులు తగ్గించుకునేందుకు ఫ్రెషర్ల నియామకాలు

న్యూఢిల్లీ: సీనియర్​ ఎంప్లాయీస్​ జీతభత్యాలు, ఇతర సదుపాయాల కోసం పెడుతున్న ఖర్చులు తడిసిమోపెడు అవుతుండటంతో ఐపీ కంపెనీలు ఫ్రెషర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి.  ఫ్రెష్​ ట్యాలెంట్​ కోసం కాలేజీల్లో వేట మొదలుపెట్టాయి. ఖర్చుల తగ్గింపులో భాగంగా ఇన్ఫోసిస్,  విప్రో వంటి కంపెనీలు కొన్ని విభాగాల ఉద్యోగులకు వేరియబుల్ శాలరీని తగ్గించాయి లేదా నిలిపివేశాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్​) దాని వేతన పెంపు పద్ధతులను మార్చింది. భారీగా ఉద్యోగులను తీసుకునే మైండ్‌‌‌‌‌‌‌‌ట్రీ, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీల్లోనూ సీనియర్ల సంఖ్య తగ్గొచ్చనే అంచనాలు ఉన్నాయి.

లార్సెన్ & టూబ్రో ఇన్ఫోటెక్  వంటి కొన్ని ఐటీ కంపెనీలు ఇటీవల సిబ్బందికి రివార్డ్‌‌‌‌‌‌‌‌లు ఇచ్చాయి. అయినప్పటికీ మైడ్​సైజ్​ కంపెనీలు 2023 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ నియామకాలను వేగవంతం చేయాలని కోరుకుంటున్నాయి.  సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ సేవల ఎగుమతిదారు కాగ్నిజెంట్, నగరాల్లో క్యాంపస్ నియామకా కోసం తాము వెళ్లే కాలేజీల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు  తెలిపింది. ఈ కంపెనీ 2022లో భారతదేశం నుండి 50 వేల మంది ఫ్రెషర్లను  తీసుకోవడానికి రెడీ అవుతోంది. ఇంతగా కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి. “మేం భారత్​లో క్యాంపస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను తిరిగి స్టార్ట్​ చేశాం.

మా తాజా నియామకాలలో ఎక్కువగా క్లౌడ్, ఏఐ, అనలిటిక్స్, ఐఓటీ,  డిజిటల్ ఇంజనీరింగ్​కు సంబంధించిన జాబ్స్​ ఉంటాయి. వీరిలో ఎక్కువ మందిని ఇంజనీరింగ్ కాలేజీల నుంచి తీసుకుంటాం” అని కాగ్నిజెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంతను ఝా అన్నారు. మిడ్-సైజ్ ఐటీ సంస్థ మైండ్‌‌‌‌‌‌‌‌ట్రీ 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5,000–-6,000 క్యాంపస్ స్టూడెంట్లను తీసుకోవాలని భావిస్తోంది. లార్సెన్ & టూబ్రో ఇన్ఫోటెక్ గత ఏడాది కంటే 10 శాతం ఎక్కువ ఫ్రెషర్లను రిక్రూట్ చేయనుంది.  గత మూడేళ్లలో ఎన్నడూ లేనన్ని జాబ్స్​ ఇవ్వనుంది. 

ఎక్స్​పర్టులు ఏమంటున్నారంటే..

ఐటీ కంపెనీలకు ప్రస్తుతం పరిస్థితులు అనువుగా లేకపోయినా గ్రోత్​మాత్రం ఆగదని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా అన్నారు. ఎక్కువ మంది ఫ్రెషర్లను తీసుకోవడం ద్వారా కంపెనీలు అట్రిషన్‌‌‌‌‌‌‌‌ను (రాజీనామాలు) తట్టుకోగలుగుతాయని, అందుకే ఇవి క్యాంపస్ నియామకానికి ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ‘‘పెద్ద కంపెనీలు గతేడాది చాలా  జాబ్స్​ఇచ్చాయి.  మిడ్-టైర్ కంపెనీలు వేగంగా అభివృద్ధి​ చెందుతున్నందున టాలెంట్ పూల్‌‌‌‌‌‌‌‌ను నిర్మించాలి.

క్యాంపస్ హైర్లకు కూడా కొత్త టెక్నాలజీలపై ట్రైనింగ్​ఇస్తాయి”అని గుప్తా చెప్పారు. తక్కువ ఖర్చుతో ట్యాలెంట్​ను సమర్థంగా వాడుకోవాలంటే ప్రస్తుత వర్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌కి తాజా గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌లను చేర్చడం తప్పనిసరని మైండ్‌‌‌‌‌‌‌‌ట్రీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ సురేష్ బెతవాండు అన్నారు. ఏ పెద్ద సంస్థ అయినా గ్రోత్​ని కొనసాగించేందుకు ట్యాలెంట్​పూల్​ను బలోపేతం చేయాలని, ఇందుకు క్యాంపస్ నియామకం అవసరమని ఎల్​&టీ ఇన్ఫోటెక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నచికేత్ దేశ్‌‌‌‌‌‌‌‌పాండే అన్నారు. ఇది 2021–-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5,500 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. ఈ సంవత్సరం దాదాపు 6,000 మందిని తీసుకోనుంది.

తమ వద్ద డిజిటల్, క్లౌడ్, డేటా, అనలిటిక్స్  సైబర్ సెక్యూరిటీ,  ఐఓటీ, యూఐ/యూఎక్స్​ డొమైన్​లో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. డిజిటల్, క్లౌడ్, డేటా, అనలిటిక్స్  సేవల కోసం కూడా కేండిడేట్లను తీసుకుంటామని దేశ్‌‌‌‌‌‌‌‌పాండే చెప్పారు. ఐటీ కంపెనీలు తమ బిజినెస్​ను టైర్ 2,  3 నగరాలకు కూడా విస్తరిస్తున్నాయి. “ఫ్రెషర్ హైరింగ్‌‌‌‌‌‌‌‌ని పెంచడానికి  దేశవ్యాప్తంగా మరిన్ని కాలేజీలతో మాట్లాడాం.  భోపాల్, జబల్‌‌‌‌‌‌‌‌పూర్, డెహ్రాడూన్, పూణే, భువనేశ్వర్, జలంధర్, జంషెడ్‌‌‌‌‌‌‌‌పూర్, లక్నో  మంగళూరులో మా నియామకాలు ఉంటాయి ”అని ఎంఫసిస్​ సీహెచ్​ఆర్​ఓ  శ్రీకాంత్ కర్రా అన్నారు.

టెక్ మహీంద్రా కూడా టైర్2,  టైర్3 నగరాల నుండి ఫ్రెషర్లను తీసుకుంటోంది. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10 వేల మంది ఫ్రెషర్లను చేర్చుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇంతే సంఖ్యలో జాబ్స్​ఇవ్వనుంది. అన్ని స్థాయిలలో నియామకాలను పెంచుతున్నామని, ‘స్టెమ్​’ కోర్సుల స్టూడెంట్లనూ నియమిస్తున్నామని కంపెనీ గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్షవేంద్ర సోయిన్ చెప్పారు.