వెంట వెళ్లిన వారే చంపి ఉంటారని అనుమానం

వెంట వెళ్లిన వారే  చంపి ఉంటారని అనుమానం

కోనరావుపేట,వెలుగు: బతుకుదెరువు కోసం మలేషియా వెళ్లిన ఓ యువకుడు అక్కడ హత్యకు గురయ్యాడు. ఈ విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఆ యువకుడి డెడ్​బాడీ స్వగ్రామం చేరుకోనున్నది. బాధిత కుటుంబీకులు, గ్రామస్తుల కథనం ప్రకారం..రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వంకాయల దేవేంద్ర, శ్రీనివాస్ ల కొడుకు రాకేశ్(20) తంగలపల్లి, ఎల్లారెడ్డిపేటకు చెందిన ఇద్దరు యువకులతో కలిసి విజిటింగ్​వీసాపై జులై 24న మలేషియాకు వెళ్లాడు.

వెళ్లేముందు రాకేశ్​తన మామ దండు అనిల్​వద్ద రూ.20వేలు తీసుకున్నాడు. ఆ డబ్బును రాకేశ్​తన దగ్గరే పెట్టుకున్నాడు. ఆగస్ట్ 16న రాకేశ్​ హాస్పిటల్​లో చేరాడని, అతనికి సీరియస్​గా ఉందని కుటుంబసభ్యులకు సమాచారం వచ్చింది. అతనితో పాటు వెళ్లిన ఇద్దరు యువకుల ఆచూకీ లేదు. వారే అతడిని చంపి పరారై ఉంటారని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. రాకేశ్​డెడ్​బాడీ తెప్పించాలని ఆద్యగోలి ఫౌండేషన్ చైర్మెన్ గోలి మోహన్ ను కోరగా ఆయన సొంత ఖర్చులతో మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు.