చాలా రోజుల తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ మెగా ఫోన్ పట్టబోతున్నారు. ఈసారి టాలీవుడ్ యంగ్ హీరోను డైరెక్ట్ చేయబోతున్నారు. హీరోగా సత్తా చూపించిన అర్జున్ విలన్ గానూ ప్రేక్షకులను మెప్పించారు. తనదైన నటతో అందరితో శభాష్ అనిపించుకున్నారు. అర్జున్ దర్శకత్వంలో యువ హీరో విశ్వక్ సేన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్ చెప్పిన కథ విశ్వక్ కు బాగా నచ్చిందట. అతి త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుందని సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు రానున్నాయి.
అర్జున్ నటుడిగా, విలక్షణ నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇక హీరో విశ్వక్ సేన్ తాజాగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్నారు. మే 6వ తేదీన విడుదలైన ఈ మూవీ విశ్వక్ సేన్ కు మంచి పేరు తీసుకొచ్చింది. విశ్వక్ సేన్ తర్వాత సినిమా ‘దమ్కీ’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. మరో మూడు సినిమాలకు కూడా విశ్వక్ సేన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వివరాల కోసం..
ముగ్గురు వ్యాపారవేత్తలకు రాజ్యసభ సీట్లు