మా పార్టీలోకిరండి..మీకు సముచిత గౌరవం ఇస్తాం..జీవన్ రెడ్డికి ఆల్  ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విన్నపం

మా పార్టీలోకిరండి..మీకు సముచిత గౌరవం ఇస్తాం..జీవన్ రెడ్డికి ఆల్  ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విన్నపం

కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్  సీనియర్  నేత టి.జీవన్ రెడ్డి తమ పార్టీలోకి వస్తే సముచిత గౌరవం కల్పిస్తామని ఆల్  ఇండియా ఫార్వర్డ్  బ్లాక్  రాష్ట్ర కన్వీనర్  అంబటి జోజిరెడ్డి తెలిపారు. కరీంనగర్‌‌‌‌లో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. జీవన్ రెడ్డికి సీఎం కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసే ఆయన వంటి నిబద్ధత కలిగిన నాయకులకు తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డితో తాను ఫోన్​లో మాట్లాడినట్లు చెప్పారు. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఆలోచించి తెలుపుతానని చెప్పారని అన్నారు.