- సస్పెన్షన్ చేసిన కలెక్టర్
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో పని చేస్తున్న వంట మనిషి(కామాటి) శ్రీనివాస్ మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదాడు. తాళ్ల ధర్మారం నుంచి డిప్యూటేషన్‌పై జగిత్యాలకు వచ్చిన శ్రీనివాస్ నాలుగు నెలలుగా ప్రతి రోజూ తాగి వచ్చి విద్యార్థులను చీపురుతో కొడుతున్నాడు.
హాస్టల్ వార్డెన్ మధుసూదన్ పలుమార్లు మందలించినా మార్పు రాకపోవడంతో ఈ విషయంపై ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో కలెక్టర్ సత్యప్రసాద్ శ్రీనివాస్‌ను విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
