టెర్రరిస్టులను గుర్తించేందుకు ఆర్మీ శునకాలకు శిక్షణ

టెర్రరిస్టులను గుర్తించేందుకు ఆర్మీ శునకాలకు శిక్షణ

జమ్ము కశ్మీర్ లో ఆర్మీ డాగ్స్ కు శిక్షణ అందిస్తున్నారు. బుద్గామ్ లో ఈ ట్రైనింగ్ సాగుతోంది. ఈ ట్రైనింగ్ లో టెర్రరిస్టులను గుర్తించి వారిని పట్టుకునేందుకు ఆర్మీ డాగ్ లకు అధికారులు ట్రైనింగ్ ఇస్తున్నారు. దాంతో పాటు టెర్రరిస్టుల వాహనాలు, టెర్రరిస్టులను, ఆయుధాలను గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ఉగ్రమూకను గుర్తించి వారిపై దాడి చేసేలా శిక్షణ ఇస్తున్నారు. ఉగ్రవాదులతో పోరాడటంలో ఆర్మీ డాగ్స్ తమ వంతు కృషి చేస్తున్నాయి. ప్రతి జాగిలం సైనికుడిగా మారి ఉగ్రవాదుల్ని మట్టు పెట్టేందుకు సహాయపడుతున్నాయి. జవాన్లతో పాటు దేశ సరిహద్దుల్లో ఆర్మీ డాగ్స్ కాపలా కాస్తున్నాయి.  

https://twitter.com/ANI/status/1585666408540930048

ఇటీవలే ఉగ్రవాదులతో పోరాడి జూమ్ అనే డాగ్ మృతి చెందింది. జమ్ము కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఓ కీలక ఆపరేషన్ ఈ డాగ్ కూడా పాల్గొన్నది. నివాస ప్రాంతాల్లో నక్కిన ఉగ్రవాదులను పట్టుకునే క్రమంలో జవాన్లతో పాటు జూమ్ ను కూడా అధికారులు రంగంలోకి దింపారు. ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతాలను గుర్తించిన జూమ్ .... శరీరంలోకి రెండు బుల్లెట్లు దిగి రక్తమోడుతున్నా.. వెనకడుగు వేయకుండా ధైర్య సాహసాలను ప్రదర్శించింది. అనంతరం ఆ ఇద్దరు ముష్కరులను  జవాన్లు మట్టుబెట్టారు. జూమ్‌ను వెంటనే చికిత్స కోసం శ్రీనగర్‌లోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఉగ్రవాదుల ఏరివేతలో కీలక పాత్ర పోషించి అసువులు బాసిన సైనిక శునకం జూమ్‌కు ఆర్మీ ఘన నివాళి అర్పించింది.