
- జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా
జమ్మూ: ఆర్టికల్ 370 రద్దు చేసి రెండేళ్లయినా మార్పు లేదని.. పైగా తాము అధికారంలో ఉన్నప్పుడు అణిచివేసిన చోట ఇప్పుడు మిలిటెన్సీ పెరుగుతోందని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలను టార్గెట్ చేస్తున్నారని, సామాన్య పౌరులే కాదు.. మైనారిటీ వర్గాలకు చెందిన పోలీసులు కూడా దాడులకు గురవుతున్నారన్నారు. ఎదురుకాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు.
వెంటనే అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించాలి, లేకుంటే పరిస్థితి 1996 కంటే దారుణంగా ఉందని కేంద్రం అంగీకరించాలని డిమాండ్ చేశారు. 1990 మరియు 1996 మధ్య ఎన్నికలు లేని సమయాలు ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ లో తిరుగుతున్న విమానాల సంఖ్య మరియు పర్యాటకాన్ని సాధారణ స్థితికి సంకేతంగా అభివర్ణించవద్దన్నారు. శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇప్పటికీ సురక్షితంగా లేరని, జమ్మూ కశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ రాజకీయ కోణంతో అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను విభజించిందని ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
నిఖత్ జరీన్ కు అభినందనల వెల్లువ
జ్ఞాన్వాపి మసీదు కేసు.. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
కెనడా పార్లమెంటులో కన్నడలో ఎంపీ ప్రసంగం
జకార్తా బయలుదేరిన పురుషుల హాకీ టీం