కెనడా పార్లమెంటులో కన్నడలో ఎంపీ ప్రసంగం

కెనడా పార్లమెంటులో కన్నడలో ఎంపీ ప్రసంగం
  • భారత్ బయట పార్లమెంటులో కన్నడ మాట్లాడడం ఇదే మొదటిసారి
  • కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న కెనడా ఎంపీ చంద్ర ఆర్య

భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ పార్లమెంటులో కన్నడ భాషలో ప్రసంగించి మాతృ భాష పట్ల తనకున్న మమకారం చాటుకున్నారు. ఎంపీ చంద్ర ఆర్య కన్నడలో చేసిన ప్రసంగం లక్షల మంది హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కన్నడ భాషకు సుదీర్ఘమైన చరిత్ర ఉందని,  5 కోట్ల మంది ప్రజలు మాట్లాడతారని చెప్పారు. భారత్ కు బయట ప్రపంచవ్యాప్తంగా ఒక పార్లమెంటులో కన్నడలో మాట్లాడడం ఇదే మొదటిసారి అంటూ ఎంపీ చంద్ర ఆర్య ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

పార్లమెంటులో ప్రసంగించే అవకాశం లభించినప్పుడు కన్నడలో మాట్లాడాలని ఉందని సభ అనుమతి తీసుకుని ఎంపీ చంద్ర ఆర్య ప్రసంగించారు. రచయిత కువెంపు రాసిన, డాక్టర్ రాజ్ కుమార్ ఆలపించిన.. ‘నీవు ఎక్కడ ఉన్నా..ఎలా ఉన్నా.. ఎప్పుడూ కన్నడిగానే ఉండాలి’ అన్న పాటతో ప్రసంగాన్ని ముగించారు. తోటి సభ్యులు చప్పట్లతో ఎంపీ చంద్ర ఆర్యను అభినందించారు.

ఎంపీ చంద్ర ఆర్య సొంతూరు కర్నాటకలోని తూముకూరు జిల్లా సిరా తాలూకా. కర్ణాటకలోని ధార్వాడ్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

మరిన్ని వార్తల కోసం..

కల్లాల్లో ధాన్యం తడిసిపోతోందని రైతుల ఆందోళన

దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకం

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ - పవన్ కళ్యాణ్