బుల్లెట్లు, బాంబులతో కళతప్పిన కాశ్మీరం..

బుల్లెట్లు, బాంబులతో కళతప్పిన కాశ్మీరం..

కాశ్మీర్ లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ప్రకృతికి చీర కట్టినట్లు ఉంటుంది కాశ్మీర్. అందాల సరస్సులు అందరినీ ఆకట్టుకుంటాయి. కాశ్మీర్ అందాలు చూసి టూరిస్టులు పరవశించి పోతుంటారు. ఇదంతా ఫిబ్రవరి 14 నాటి ముందు సంగతి. పుల్వామా దాడి తో కాశ్మీర్ లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. దాడి ప్రభావం టూరిజం పై తీవ్రంగా పడింది. కాశ్మీర్ లోని హోటళ్లు, రెస్టారెంట్ లు టూరిస్టులు ఎవరూ లేక వెలవెలబోతున్ నాయి. దాల్ సరస్సును చూడ్డా నికి వచ్చే వాళ్లెవరూ కనిపించడం లేదు. ఒకప్పుడు టూరిస్టులతో కళకళలాడిన కాశ్మీర్ ప్రస్తుతం పర్యాటకులు లేక నిర్మానుష్యంగా మారింది.

గుల్ మార్గ్ హిల్ స్టేషన్ కు టూరిస్టులు కరువు
కాశ్మీర్ లోయలోని గుల్ మార్గ్ హిల్ స్టేషన్ టూరిజానికి ఫేమస్. కాశ్మీర్ కు వచ్చిన టూరిస్టులెవరూ ఇక్కడి గోండోలా రైడ్ చూడకుండా వెళ్లరు. అయితే, ఇదంతా నిన్నటి మాట. పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్ లోయకు వచ్చే టూరిస్టులు కరువయ్యారు. గుల్ మార్గ్ లోని అనేక రెస్టారెంట్ లు ఇప్పుడు టూరిస్టులు లేక …వెలవెల బోతున్ నాయి. ఎటు చూసినా ఖాళీ కుర్చీలు….ఖాళీ సోఫాలే కనిపిస్తున్నాయి. దీంతో, గోండోలా రైడ్ చూపించి పొట్ట పోసుకునే వాళ్లు మూడు పూటల తిండికే లాటరీ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాశ్మీర్ కు వెళ్లొ ద్దన్న విదేశాలు
ఇండియాకు వెళ్లే టూరిస్టులను ఎలాంటి పరిస్థితుల్లోనూ కాశ్మీర్ కు వెళ్లొద్దని అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్ వంటి అనేక దేశాలు హెచ్చరించాయి. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఈమేరకు ఇండియాలో పర్యటిస్తు న్న తమ దేశస్తు లను ఫిబ్రవరి 27న అప్రమత్తం చేసింది. బయట తిరిగేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ‘లో ప్రొఫైల్ ’ మెయింటైన్ చేయాలని కోరింది. యునైటెడ్ కింగ్ డమ్ కూడా ఈ విషయంలో ముందుంది. ఇండియా పర్యటనలో ఉన్న తమ దేశస్తు లను అలర్ట్ చేసింది. ఆస్ట్రేలియా అయితే జమ్మూ కాశ్మీర్ దరిదాపులకు కూడా వెళ్లొద్దని తమ దేశస్తులను కోరింది. మరిన్ని దాడులు చేయడానికి టెర్రరిస్టులు ప్లాన్ లు వేస్తున్నారన్న సమాచారం అందిందని పేర్కొంది. ఆస్ట్రేలియన్లను జాగ్రత్తగా ఉండాలని కోరింది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని ‘ హైలెవెల్ రిస్క్ జోన్ ’ గా ప్రకటించింది.

ఖజానాకు పెద్ద ఎత్తున రాబడి తెస్తోంది టూరిజమే
జమ్మూ కాశ్మీర్ ఖజానాకు టూరిజం పెద్ద ఎత్తున రాబడి తెచ్చి పెడుతున్నది. కాశ్మీర్ ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా పర్యాటకరంగం మారింది. ఈ నేపథ్యంలో పుల్వామా దాడి తర్వాత రాష్ట్రానికి టూరిస్టులు రావడం బాగా తగ్గిపోయింది. ఈ ప్రభావం రాష్ట్ర ఆదాయం పై కూడా పడుతోంది. అంతేకాదు కాశ్మీర్ అంటేనే మిగతా ప్రపంచంలో ఒకరకమైన భయం నెలకొంది. ఏ క్షణం ఎక్కడ బాంబు పేలుతుందో, ఎక్కడ ఆత్మాహుతి దాడులు జరుగుతాయో అని బయటి ప్రజలు భయపడుతున్నారు. టూరిజాన్నే నమ్ముకుని, బతుకు బండి నడుపుకుంటున్న వాళ్లు ఇప్పుడు రోడ్డున పడ్డారు. వాళ్ల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఈ ఆకలి బాధలు తీరాలంటే టూరిజం మళ్లీ గాడిన పడాలి. కాశ్మీర్ అందాలు చూడటానికి టూరిస్టులు రావాలి. దీని కోసం మరికొంతకాలం ఆగక తప్పదేమో.