తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది.. ఏం చేస్తారో చేస్కోండి: పవన్ ఛాలెంజ్

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది.. ఏం చేస్తారో చేస్కోండి: పవన్ ఛాలెంజ్

హైదరాబాద్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. ఇకపై తెలంగాణలో జనసేన ఉంటుందని, తెలంగాణలో తానే స్వయంగా తిరుగుతానని చెప్పారు.

ఇన్ని రోజులు భరించామని, 12 ఏళ్లు భరించామని.. ఇకపై జనసేన తెలంగాణలో కూడా పోటీ చేస్తుందని, ఏం చేస్తారో చేసుకోండని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. ప్రతి సమస్య పైనా మాట్లాడతానని స్పష్టం చేశారు. తెలంగాణలో దేశంలో అంతర్భాగం అని.. దేశంలో తాను ఎక్కడైనా కాలుపెడతానని.. వద్దనడానికి మీరెవరని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. 

పవన్ ఇంకా ఏమన్నారంటే..
* మీరు అన్ని రాష్ట్రాలకు వెళ్లొచ్చని, నేను ఇక్కడికి రాకూడదా..?
* భయపెట్టాలని చూస్తే భయపడం..
* ఎలా తిరుగుతావో చూస్తాం..  నాలుక కోస్తం అంటున్నారు
* నా నాలుక చూపిస్తున్నా.. రండి చూసుకుందాం
* తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేస్తాననే భయం
* మీ తాటాకు చప్పుళ్లకు భయపడం
* తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హెచ్చరిక
* ఇకపై తెలంగాణలో జనసేన ఉంటుంది.. తెలంగాణలో నేనే తిరుగుతా
* గద్దర్ ఉన్నపుడు ఎక్కడికి పోయారు.. ఆయనకు నేరు కారు కొనిచ్చా..?
* తెలంగాణకు అన్యాయం జరిగితే మొదట పోరాడేది జనసేననే..