ముచ్చింతల్ దివ్యసాకేతంలో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా సాతున్నాయి. 12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువు ఐదో రోజుకు చేరుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ యాగశాలలో పరమేష్టి, వైభవేష్టి కార్యక్రమాలు జరగుతున్నాయి. తీవ్ర వ్యాధుల నివారణ కోసం పరమేష్టి, పితృదేవతాతృప్తి ద్వారా విఘ్న నివారణ కోసం వైభవేష్టి నిర్వహిస్తున్నారు. ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర శతనామావళి పూజ జరగింది.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముచ్చింతల్ చేరుకున్నారు. చిన్న జీయర్ స్వామి చెప్పిన మాటలు తనకు ఎప్పటికీ గుర్తు ఉంటాయన్నారు పవన్ కళ్యాణ్. మన మతంను ప్రేమించు పర మతం ను గౌరవించు అని స్వామీజీ చెప్పారన్నారు. రామానుజ చార్యులు తనకు గొప్ప విప్లవ నాయకులుగా అనిపిస్తారన్నారు. దైవం ముందు అందరు సమానం అని చెప్పిన వారు రామానుజ చార్యులు అని గుర్తకు తెచ్చుకున్నారు పవన్. 216 అడుగుల విగ్రహం పెట్టడం భాగ్య నగరంకు సరికొత్త గుర్తు అన్నారు. చిన్న జీయర్ స్వామి వారు తలపెట్టిన కార్యక్రమం చాల అద్భుతమైనదన్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కారం కావడం చాలా సంతోషమన్నారు. మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్.
ఇవి కూడా చదవండి:
లతా మంగేష్కర్ చివరిగా పాడిన పాట ఇదే
సంగీత ప్రపంచానికి ఆమె లేని లోటు తీర్చలేనిది
