డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాల సప్లై

డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాల సప్లై

డ్రోన్ల ద్వారా దేశంలోకి అక్రమంగా పేలుడు పదార్థాల సప్లైని భద్రతాబలగాలు అడ్డుకున్నాయి . డ్రోన్ నుంచి జారవిడిచిన 3 మ్యాగ్నెటిక్ ఐఈడీ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అఖ్నూర్ సెక్టార్ లోని భారత్ - పాక్ సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ సంచరిస్తున్నట్లు గుర్తించిన  భద్రతా సిబ్బంది... కాల్పులు జరిపారు. ఆ తర్వాత యాంటీ డ్రోన్ సిస్టమ్ ను రంగంలోకి దించగా.. కన్ చక్ లో మరోసారి డ్రోన్ కన్పించింది. వెంటనే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. దీంతో డ్రోన్ లో ఉన్న పేలోడ్ కిందపడగా.. డ్రోన్ మాత్రం తప్పించుకున్నట్లు జమ్మూ అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు. డ్రోన్ నుంచి కిందపడిన పే లోడ్ లో టిఫిన్ బాక్సుల్లో ఉన్న మూడు మ్యాగ్నెటిక్ ఐఈడీలకు టైమర్ సెట్ చేసి ఉన్నట్లు తెలిపారు. ఐఈడీలను డిఫ్యూజ్ చేసినట్లు తెలిపారు.

అమర్ నాథ్ యాత్రే లక్ష్యంగా....

అమర్ నాథ్ యాత్రే లక్ష్యంగా విధ్వంసం సృష్టించాలని పాక్ గత కొంతకాలంగా చేస్తున్న కుట్రలను పోలీసులు భగ్నం చేస్తున్నారు. గత నెలాఖర్లో కథువాలోని తాల్లీ హరియాచాక్ దగ్గర ఓ క్వాడ్ కాప్టర్ ను గుర్తించి జమ్ము పోలీసులు కూల్చివేశారు . అందులో 7 మ్యాగ్నెటిక్ బాంబులు, 7 యాజీబీఎల్ గ్రనేడ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.