జంతర్​ మంతర్​ చూ మంతర్​

జంతర్​ మంతర్​ చూ మంతర్​

ఒక వస్తువు ఒక చోట నుంచి మాయమై మరో చోట ప్రత్యక్షమవడం చాలా తెలుగు సినిమాల్లో చూశాం. అయితే.. సినిమాల్లో అది మాయగానో, మ్యాజిక్​లాగానో చూపిస్తారు. కానీ.. ఇక్కడ అలాంటిది నిజంగానే జరిగిందట. అమెరికా చేసిన ఒక ప్రయోగం వల్ల వందల కిలోల బరువు ఉండే ఒక షిప్​ మాయమై 500 కిలోమీటర్ల దూరంలో ప్రత్యక్షమైంది. అదెలా జరిగింది?ఆ  ప్రయోగం అమెరికా ఎందుకు చేసింది? ఇంతకీ ప్రయోగం సక్సెస్​ అయ్యిందా?ఫెయిల్​ అయ్యిందా?


అది 28 అక్టోబరు1943. సరిగ్గా సాయంత్రం 5:15 గంటలకు.. యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన డిస్ట్రాయర్ షిప్​ ‘‘యూఎస్​ఎస్​ఎస్​ ఎల్ర్డిడ్జ్’’ ఫిలడెల్ఫియా ఓడరేవులో ఉంది. లంగరు వేసి ఉన్న ఆ షిప్​ నుంచి ఒక్కసారిగా నీలి రంగు కాంతి రావడం మొదలైంది. ఆ కాంతిలో ఓడ కూడా సరిగ్గా కనిపించడం లేదు. కొన్ని నిమిషాలు ఆ వెలుగు అలాగే ఉంది. కాసేపటి తరువాత ఆ కాంతితో పాటు షిప్​ కూడా మాయమైంది. అక్కడున్న వాళ్లంతా అసలేం జరిగిందో తెలియక ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొందరు అటువైపు వెళ్లడానికే భయపడుతున్నారు. ఇంతలోనే ఆ ప్రాంతానికి ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్ఫోక్ ప్రాంతంలో షిప్​ కనిపించింది. కొన్ని నిమిషాల్లోనే అక్కడి నుంచి కూడా మాయమై ఫిలడెల్ఫియాకు తిరిగొచ్చింది. నిమిషాల్లో వందల కిలోమీటర్లు ట్రావెల్​ చేయడం ఎలా సాధ్యమైంది? అనేది ఇప్పటికీ మిస్టరీనే. 


అమెరికా ఇంత పెద్ద ప్రయోగం చేసినా.. ఎవరికీ తెలియదు. అంతేకాదు.. ఈ ప్రయోగం జరిగిన పన్నెండేండ్లకు దీని గురించి ప్రపంచానికి తెలిసింది. అమెరికాలో అలెన్ అనే ఒక ఎక్స్‌‌‌‌‌‌‌‌మర్చంట్ మెరైనర్ ఈ ఎక్స్​పర్మెంట్​ని చూసినట్లు చెప్పాడు. అతనే దీని గురించి వివరించాడు. అతను చెప్పిన దాని ప్రకారం.. యూఎస్​ నావికాదళం ‘యూఎస్​ఎస్​ఎస్​ ఎల్డ్రిడ్జ్’ అనే ఒక డిస్ట్రాయర్ ఎస్కార్ట్ క్లాస్ షిప్‌‌‌‌‌‌‌‌తో టెలీ ట్రాన్స్​పోర్టేషన్​ ఎక్స్​పరిమెంట్స్​ చేసింది. కొంతమంది సైంటిస్ట్​లు షిప్​ని మాయం చేయడానికి ప్రయత్నించారు. కానీ.. ఊహించని ఫలితాలు రావడంతో గుట్టు చప్పుడు కాకుండా ఎక్స్​పరిమెంట్​ని ఆపేశారు. అలెన్​  చెప్పిన ఈ వివరాలన్నీ అవాస్తవాలని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. 


టెలీ ట్రాన్స్​పోర్టేషన్​ 


ఈ ప్రయోగం కోసం ఎంతోమంది గొప్ప సైంటిస్ట్​లు పనిచేశారు. ఆల్బర్ట్ ఐన్‌‌‌‌‌‌‌‌స్టీన్ కనిపెట్టి, ప్రపంచానికి చెప్పని కొన్ని సూత్రాల ద్వారా ఈ ప్రయోగం చేసినట్టు చెప్తుంటారు. కొందరైతే ఈ ప్రయోగానికి కొన్ని నెలల ముందు చనిపోయిన నికోలా టెస్లా ప్రత్యక్షంగా ఈ ప్రయోగాల్లో పాలు పంచుకున్నట్టు చెప్పారు. అదెలాగో వాళ్లకే తెలియాలి! టెలీ ట్రాన్స్​పోర్టేషన్​ అంటే.. ఒక వస్తువును క్షణాల్లో ఒకచోట నుంచి మాయం చేసి, మరో చోట ప్రత్యక్షమయ్యేలా చేయడం. అయితే.. ఈ థియరీని ఇప్పటివరకు పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప, ప్రయోగం చేసి సక్సెస్​ అయినవాళ్లు ఎవరూ లేరు. ఈ  షిప్ టెలీ ట్రాన్స్​పోర్టేషన్​ టెక్నాలజీతో ప్రయాణించేటట్టు సైంటిస్ట్​లు ప్రయోగాలు చేశారు. ఎందుకంటే.. యుద్ధాలు జరిగినప్పుడు ఈ షిప్​లో శత్రువులు ఉండే ప్లేస్​కి వెళ్లి, అక్కడ సైన్యాన్ని, షిప్​లను ధ్వంసం చేసి క్షణాల్లో మళ్లీ తిరిగి వచ్చేయొచ్చు. శత్రు దేశాలు దాడి చేసినప్పుడు ఉన్నచోటి నుంచి క్షణాల్లో మాయమైపోవచ్చు. అందుకే అమెరికా ఈ ఎక్స్​పరిమెంట్ చేయించిందట. దీనికి ఫ్రాంక్లిన్ రెనో అనే సైంటిస్ట్​ నాయకత్వం వహించాడని చెప్పుకుంటుంటారు. 


అసలేం జరిగింది? 


అలెన్ చెప్పినదాని ప్రకారం.. ప్రయోగం చేసినప్పుడు ఈ డిస్ట్రాయర్ షిప్​ కొన్ని నిమిషాల పాటు నార్ఫోక్ ప్రాంతానికి టెలీపోర్ట్ అయ్యింది. మళ్లీ కాసేపటికి ఫిలడెల్ఫియా యార్డ్‌‌‌‌‌‌‌‌లో కనిపించింది. కొందరు ఈ షిప్​ కొన్ని నిమిషాల పాటు స్పేస్, టైమ్‌‌‌‌‌‌‌‌లో ప్రయాణించిందని కూడా చెప్తున్నారు. షిప్​ తిరిగి వచ్చాక చూస్తే.. సిబ్బంది మతిస్థిమితం కోల్పోయారు. చాలారకాల సైడ్​ ఎఫెక్ట్స్​ వచ్చాయి. షిప్​లో ఉన్నవాళ్లలో కొందరు కనిపించకుండా పోయారు. అందుకే నావికాదళం ఈ ప్రయోగాన్ని ఆపేయాలని నిర్ణయించుకుంది. తర్వాత అమెరికా కూడా ప్రయోగం గురించి దాచేసిందనే కథనాలు ఉన్నాయి. 


పాపులారిటీ 


వాస్తవానికి ఈ ప్రయోగం జరిగిందా? లేదా? అనేదాని మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అయినా.. ఈ స్టోరీ బాగా పాపులర్​ అయ్యింది. చాలామంది అలెన్​ చెప్పిన విషయాలు నమ్మారు. కొంతమంది జర్నలిస్టులు ఎల్డ్రిడ్జ్ కోసం వెతకడం మొదలుపెట్టారు. కొంతమంది ఈ స్టోరీపై డాక్యుమెంటరీలు తీశారు. “ది ఫిలడెల్ఫియా ఎక్స్​పరిమెంట్​” పేరుతో స్టీవర్ట్ రాఫిల్ అనే డైరెక్టర్​1984లో ఒక హాలీవుడ్​ సినిమా కూడా తీశాడు. ఇది బాక్స్ ఆఫీస్ హిట్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. తర్వాత ‘‘ది ఫిలడెల్ఫియా ఎక్స్‌‌‌‌‌‌‌‌పరిమెంట్ 2” కూడా వచ్చింది. దీనిపై నవలలు కూడా పబ్లిష్​ చేశారు.