జపాన్ లో భారీ భూకంపం : ఊగిపోయిన భవనాలు

జపాన్ లో భారీ భూకంపం : ఊగిపోయిన భవనాలు

జపాన్ దేశంలో మళ్లీ భూకంపం వచ్చింది. అక్కడ భూకంపాలు కామన్ అయినా.. ఇటీవల కాలంలో వరసగా వస్తున్న భూకంపాలతో జపాన్ దేశం భయాందోళనలకు గురవుతుంది. 24 గంటల ముందు తైవాన్ దేశం కేంద్రంగా వచ్చిన భూకంపంతో.. జపాన్ లో సునామీ వార్నింగ్స్ వచ్చాయి. సరిగ్గా 24 గంటలు గడవక ముందే 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది.

ఈస్ట్ కోస్ట్ హన్సు కేంద్రంగా.. 2024, ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 8 గంటల 46 నిమిషాలకు.. భూమికి 55 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ భవనాలు ఊగిపోయాయి. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టం ఎంత అనేది అధికారులు వెల్లడించలేదు. భూకంపం ధాటికి ఓ పిల్లల ఆస్పత్రిలోని పసిపిల్లలను ఉంచే ఉయ్యాలలు అటూ ఇటూ కదిలిపోవటం.. ఆ ఆస్పత్రి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దీన్ని గుర్తించిన నర్సులు పరిగెత్తుకుంటూ వచ్చి  వాటిని పట్టుకోవటం స్పష్టంగా కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.

ALSO READ : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 10మందికి తీవ్ర గాయాలు

జపాన్ లో భూకంపాలు ఎక్కువే అయినా.. ఇటీవల కాలంలో మరింత ఎక్కువగా వస్తుండటం.. పదే పదే సునామీ వార్నింగ్స్ వస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజా భూకంపంతో ఎలాంటి సునామీ వార్నింగ్స్ ఇవ్వలేదు అధికారులు. దీంతో తీర ప్రాంత ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.