ఫిఫా వరల్డ్​ కప్​ : జర్మనీపై జపాన్​ అనూహ్య విజయం

ఫిఫా వరల్డ్​ కప్​ :  జర్మనీపై జపాన్​ అనూహ్య విజయం

ఖతర్​ లో జరుగుతున్న ఫిఫా వరల్డ్​ కప్​ లో ఇవాళ జర్మనీ, జపాన్​ మధ్య జరిగిన ‘గ్రూప్​ –ఈ’ మ్యాచ్​ లో అనూహ్య ఫలితం వచ్చింది. గతంలో 4సార్లు ఫుట్​ బాల్​ ప్రపంచ చాంపియన్​ గా నిలిచిన జర్మనీని జపాన్​ ఓడించింది. మ్యాచ్​ ప్రథమార్ధం వరకు జర్మనీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. జర్మనీ ఆటగాడు గుండోగన్​ మ్యాచ్​ 33వ నిమిషంలో గోల్​ కొట్టడంతో.. ఆ టీమ్​ 1‌‌ – ‌‌‌‌0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత (ద్వితీయార్ధంలో) సీన్​ మారిపోయింది.  

జపాన్​ ఇద్దరు  ఆటగాళ్లు రిస్తో డోన్​, టకుమా అసానో  రెచ్చిపోయి వరుసగా రెండు మెరుపు గోల్స్​ చేశారు. దీంతో మ్యాచ్​ పై జపాన్​ పట్టు సంపాదించింది. గోల్స్​  చేయకుండా చివరి వరకు జర్మనీని సమర్ధంగా కట్టడి చేసింది. జపాన్​ ను విజయం వరించింది.

  • ఇక మరో మ్యాచ్​ లో డిఫెండింగ్​ చాంపియన్​ ఫ్రాన్స్​, ఆస్ట్రేలియాపై 4 –1 తేడాతో విజయం సాధించింది.
  • మొరాకో, క్రొయేషియా మధ్య జరిగిన ఇంకో మ్యాచ్​ డ్రాగా ముగిసింది.