చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిందరోవ్‌‌‌

చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిందరోవ్‌‌‌

పనాజీ: ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జావోఖిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిందరోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఫిడే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలుచుకున్నాడు. హోరాహోరీసాగిన ఫైనల్లో సిందరోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2.5–1.5 తేడాతో వీ యి (చైనా)పై నెగ్గాడు. ఫలితంగా అతి పిన్న వయసు (19 ఏళ్లు)లో ఈ ఘనత సాధించిన తొలి గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సిందరోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డులకెక్కాడు.

 తెల్లపావులతో వీ యి డ్రా వైపు వెళ్లినా.. రెండో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిందరోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అత్యుత్తమ ఆటతీరును చూపెట్టాడు. కీలక టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చకచకా ఎత్తులు వేసి గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిచాడు. దాదాపు కోటి రూపాయల ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనీ సిందరోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొంతమైంది. ఇక సిందరోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు వీ యి, ఆండ్రీ ఎసిపెంకో కూడా క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీకి అర్హత సాధించారు. మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆండ్రీ ఎసిపెంకో (ఫిడే) 2–0తో నొడిర్బెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యకుబోయోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై నెగ్గాడు.