
హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెసిడెన్షియల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు వాటర్ ట్యాంక్‌లో పురుగుల మందు కలిపిన సైన్స్ టీచర్ రాజేందర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. సైన్స్ టీచర్ రాజేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. రెసిడెన్షియల్ అసిస్టెంట్ కుక్, మరో ఇద్దరు టీచర్లు కూడా విద్యార్థులను బెదిరించినట్లు గుర్తించారు పోలీసులు. ఈ మేరకు నిందితుడు రాజేందర్, టీచర్లు సూర్య కిరణ్, వేణు, అసిస్టెంట్ కుక్ రాజేశ్వరిపై సస్పెన్షన్ వేటు పడింది. నలుగురిని విధులనుండి టెర్మినేట్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్లో రెసిడెన్షియల్ స్కూల్ నడుస్తోంది. ఈ స్కూల్లో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. శుక్రవారం ఉదయం టిఫిన్ చేసిన తర్వాత 11 మంది విదార్థులు నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆందోళన చెందిన టీచర్లు వెంటనే విద్యార్థులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
►ALSO READ | మృతదేహాన్ని హ్యాక్సా బ్లేడ్‌తో ముక్కలు చేసి.. మూసీలో పడేశాడు: స్వాతి మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు
విద్యార్థులు తాగిన నీటిలో విషం కలిసినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నీళ్లలో గడ్డి మందు కలిసినట్లు తేలటంతో.. విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ విద్యార్థులను అడిగి వివరాలు తెలసుకున్నారు. ఉపాధ్యాయునికి, అధికారికి మధ్య వివాదాలు ఉన్నట్లు విద్యార్థులు ఎస్పీకి చెప్పారు. అధికారికి ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతోనే సైన్స్ టీచర్ తాగే నీటిలో గడ్డి మందు కలిపినట్లు విద్యార్థులు చెప్పారు. మందు కలిపిన సీసా కూడా తమ గదిలో దొరికినట్టు విద్యార్థులు తెలిపారు. గడ్డి మందు నీళ్లల్లో కలిపిన ఆ ఉపాధ్యాయుడు ఆ నెపాన్ని తమపై నెట్టేయడానికి గడ్డిమందు వాసన వచ్చేలా తమ దుప్పట్లపై కూడా దాన్ని చల్లాడని తెలిపారు.