పొంచి ఉన్న ప్రీపెయిడ్ బాంబు

పొంచి ఉన్న ప్రీపెయిడ్ బాంబు

ఇప్పటికే నిత్యావసరాల ధరల మంటతో విలవిలలాడుతున్న సామాన్యుడికి  మరో  చేదు కబురు. ఈ ఏడాది దీపావళి కల్లా (అక్టోబరు చివరివారం) మొబైల్ ఫోన్  ప్రీపెయిడ్ రీచార్జి టారిఫ్ రేట్లు 12 శాతం దాకా  పెరగనున్నాయి. ఇందుకు ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్  ఐడియా కంపెనీలు రంగం సిద్ధం చేస్తున్నాయి. చివరగా గతేడాది నవంబరులో టారిఫ్ రేట్లను 20 నుంచి 25 శాతం మేర పెంచిన టెలికాం సంస్థలు, ఈ ఏడాది మరో మారు వాటిని పెంచడం ద్వారా నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవాలని యోచిస్తున్నాయి. తద్వారా వాటికి ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే  సగటు ఆదాయం (ఏఆర్పీయూ)  కూడా  భారీగా పెరగనుంది. దీనివల్ల అన్నింటి కంటే ఎక్కువగా ఎయిర్ టెల్ లబ్ధి పొందనుంది. గతేడాది టారిఫ్ రేట్లను పెంచడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు వాడే బేసిక్ ప్లాన్లు ప్రియమయ్యాయి. ఆ బాదుడును మర్చిపోకముందే..  మరోసారి రీచార్జ్ ప్లాన్ల రేటును పెంచాలని కంపెనీలు భావిస్తుండటం సామాన్యులకు ఆందోళన రేకెత్తిస్తోంది.  

మరిన్ని వార్తలు..

టీవీఎస్‌ ఐక్యూబ్‌ స్కూటర్లు లాంచ్‌

స్టార్టప్‌కు టోపి!