గుడ్న్యూస్.. జియో నెట్వర్క్ స్పెషల్ డేటా ఆఫర్స్.. డిస్కౌంట్ ఓచర్స్

గుడ్న్యూస్.. జియో నెట్వర్క్ స్పెషల్ డేటా ఆఫర్స్.. డిస్కౌంట్ ఓచర్స్

రిలయన్స్ జియో 7వ వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన ప్లాన్ లతో అదనపు డేటా.. డిస్కౌంట్ వోచర్లను అందిస్తోంది. సెప్టెంబర్ 5 నుంచి 30 మధ్య కాలంలో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. 

రూ. 299,  రూ. 749,  రూ. 2,999  ప్లాన్ లతో  ఈ ఆఫర్ ను అందిస్తోంది. రూ. 299 ప్లాన్ తో ఇప్పటికే అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 2 జిబి మొబైల్ డేటా, ప్రతి రోజు 100 ఎస్ ఎం ఎస్ లను 28 రోజుల పాటు అందిస్తున్న జియో.. ఈ ఆఫర్ ద్వారా అదనంగా 7 జిబి డేటాను అందిస్తోంది. 

రూ. 749 ప్లాన్ తో ఇప్పటికే అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 2 జిబి మొబైల్ డేటా, ప్రతి రోజు 100 ఎస్ ఎం ఎస్ లను 90 రోజుల పాటు అందిస్తున్న జియో.. ఈ ఆఫర్ ద్వారా అదనంగా 14జిబి డేటాను అదనంగా అందిస్తోంది. 

రూ. 2,999  ప్లాన్తో ఇప్పటికే అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 2 .5జిబి మొబైల్ డేటా, ప్రతి రోజు 100 ఎస్ ఎం ఎస్ లను 365 రోజుల పాటు అందిస్తున్న జియో.. ఈ ఆఫర్ ద్వారా అదనంగా 21జిబి డేటాను అందిస్తోంది. 

ఇవే కాకుండా  రూ. 800 వరకు నైట్ మెడ్ లపై 20 శాతం తగ్గింపు, రూ.100 విలువైన స్విగ్గీ కూపన్, రూ. 149 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్లపై ఉచిత మెక్ డోనాల్డ్ భోజనం, రిలయన్స్ డిజిటల్స్ పై 10 శాతం, విమానం ప్రయాణంపై 1,500 వరకు తగ్గింపు, యాత్ర.కామ్ బుకింగ్ లపై రూ.4,000,   హోటళ్లపై 15 శాతం తగ్గింపును రిలయన్స్ జియో ఆఫర్ చేస్తోంది.  ఆదనపు డేటాను డేటా కూపన్ల రూపంలో క్రెడిట్ చేస్తారు. 

ఈ ప్రయోజనాలను పొందడానికి  MyJio యాప్‌లోని వోచర్‌ల విభాగాన్ని రీడీమ్ చేసుకోవాలి. స్క్రీన్‌పై 'మెనూ' బటన్‌పై నొక్కి, 'వోచర్లు'పై క్లిక్ చేయడం ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు.