ఢిల్లీ ఎయిర్​పోర్టులో షా ఫైజల్​ అరెస్ట్

ఢిల్లీ ఎయిర్​పోర్టులో షా ఫైజల్​ అరెస్ట్

పబ్లిక్​ సేఫ్టీ యాక్ట్​ కింద కేసు

న్యూఢిల్లీ/శ్రీనగర్: మాజీ ఐఏఎస్​ ఆఫీసర్, జమ్మూకాశ్మీర్​ పీపుల్స్​ మూవ్‌‌మెంట్​(జేకేపీఎం) పార్టీ చీఫ్​ షా ఫైజల్​బుధవారం అరెస్టయ్యారు. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్​(టర్కీ) వెళ్లే విమానం  ఎక్కడానికి కొద్ది నిమిషాల ముందు ఎయిర్​పోర్టులోనే ఆయన్ను సెక్యూరిటీ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఫైజల్‌ను అక్కణ్నుంచి తిరిగి శ్రీనగర్​ పంపారు. పబ్లిక్​ సేఫ్టీ యాక్ట్​(పీఎస్​ఏ) కింద ఆయనపై కేసు నమోదు చేసి హౌస్​ అరెస్టులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. కాశ్మీర్​లో 370 ఆర్టికల్​ రద్దు, రాష్ట్ర విభజన తర్వాత ఫైజల్​ లాంటి ఒకరిద్దర్ని తప్ప దాదాపు లీడర్లందరినీ పోలీసులు అరెస్టు చేశారు. రెండ్రోజులుగా ఫైజల్​ పలు ఇంటర్నేషనల్​ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ కేంద్ర సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీ, షా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు.