
JNU విద్యార్థులపై దాడి ఖచ్చితంగా కుట్రేనన్నారు కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్. దాడికి బాధ్యతగా హోంమంత్రి, వైస్ ఛాన్స్ లర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముసుగు వేసుకున్న వ్యక్తులు క్యాంపస్ లోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు. వైస్ ఛాన్స్ లర్, పోలీసులు ఏం చేస్తున్నారన్నారు. దాడి ఘటనలో చాలా ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదన్నారు.