
ఆదిలాబాద్, వెలుగు: టాస్క్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆగస్టు 5న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జాబ్ మేళాకు సంబంధించి పోస్టర్లను సోమవారం ఆయా శాఖల అధికారులతో కలిసి విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలో దాదాపు 20 ఐటీ, నాన్ ఐటీ కంపెనీల ప్రతినిధులు వస్తారని, వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్ నుంచి పీజీ అర్హత కలిగిన వారు టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు పొందవచ్చన్నారు.
అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అన్ని పీహెచ్సీల్లో వైద్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. 200 హ్యాబిటేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ సీవీయన్ రాజు తదితరులు పాల్గొన్నారు.