సమ్మె చేస్తే జాబ్ నుంచి తీసేయండి

సమ్మె చేస్తే జాబ్ నుంచి తీసేయండి

సమ్మెకు వెళ్లే ఫీల్డ్​ అసిస్టెంట్లను తొలగించండి

హైదరాబాద్, వెలుగు: డ్యూటీలకు హాజరుకాని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్​ రఘునందన్​రావు మంగళవారం డీఆర్డీవోలను ఆదేశించారు. వారి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించాలని సూచించారు. రాష్ట్రంలో సుమారు 7,500 మంది ఉపాధి హామీ పథకం ఫీల్డ్​ అసిస్టెంట్లు ఉన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గురువారం నుంచి సమ్మె చేస్తామని వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కమిషనర్​ తాజా ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఉపాధి వర్క్ డిమాండ్‌ను తీసుకోవాలని సూచించారు. సమ్మెలో పాల్గొనే ఫీల్డ్​ అసిస్టెంట్ల వివరాలను కమిషనరేట్‌కు పంపాలని ఆదేశించారు.

For More News..

బర్త్ సర్టిఫికెట్లకు పెరిగిన డిమాండ్.. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ లేనివాళ్లకెలా?

పట్నం బాట పట్టిన పల్లేవాసులు

తెలంగాణ నుంచి రాజ్యసభకు వారిద్దరేనా?

ఏపీ పంపిస్తామన్నా.. తెలంగాణ తీసుకెళ్లట్లేదు..

ఇయర్ ఫోన్స్ కొంటే.. కారు గెలిచారని ఫోన్

రేవంత్ పోరాటంతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు