అలస్కా ప్రైమరీని గెలుచుకున్న జో బిడెన్

అలస్కా ప్రైమరీని గెలుచుకున్న జో బిడెన్

వాషింగ్టన్ : డెమోక్రాట్ల తరఫున అమెరిక అధ్యక్ష పదవి పోటీ పడనున్న జో బిడెన్ అలస్కా ప్రైమరీని గెలుచుకున్నారు. 55.3 శాతం ఓట్లను సాధించారు. ఈ విషయాన్ని పార్టీ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. డెమోక్రాట్ల నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం శాండర్స్, జో బిడెన్ మధ్య పోటీ ఉండే. జో బిడెన్ కు ప్రజా మద్దతు ఉన్నందున తాను పోటీ లో నుంచి తప్పుకుంటున్నానని గత వారమే శాండర్స్ ప్రకటించారు. దీని కన్నా ముందే అలస్కా ప్రైమరీ కోసం ఎన్నికలు జరిగాయి. కరోనా కారణంగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించారు. శాండర్స్ పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ ఈ ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. 44.7 శాతం ఓట్లు శాండర్స్ కు దక్కాయి. పార్టీ లో పట్టుకోసం తన మద్దతుదారులను తెలుసుకోవటం కోసం ఎన్నికలను కొనసాగిస్తామని జో బిడెన్ చెప్పారు. శాండర్స్ కు మద్దతిస్తున్న వారు కూడా తన తో కలిసి రావాలని ఈ సందర్భంగా జో బిడెన్ కోరారు.