చంద్రఘంటాదేవిగా ‘జోగులాంబ’

చంద్రఘంటాదేవిగా ‘జోగులాంబ’

అలంపూర్, వెలుగు : అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు చంద్రఘంటాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

సహస్రనామార్చన, చండీ హోమం, దర్బారు సేవ చేశారు. దర్బార్ సేవలో భాగంగా అమ్మవారికి నవదుర్గ అలంకారంలో కొలువు పూజ, కుమారి పూజ, సువాసిని పూజలు, మహా మంగళహారతి, మంత్రపుష్పం నిర్వహించారు.