ఈ రూల్స్ అతిక్రమిస్తే అక్రిడేషన్ తొలగిస్తాం

ఈ రూల్స్ అతిక్రమిస్తే అక్రిడేషన్ తొలగిస్తాం

న్యూఢిల్లీ: దేశ భద్రత, సమగ్రతకు భంగం కలిగేలా వ్యవహరిస్తే జర్నలిస్టుల అక్రిడేషన్లను తొలగించనున్నారు. ఈ మేరకు దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమాధికారం, పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే పాత్రికేయులు తమ అక్రిడేషన్లను కోల్పోవాల్సి వస్తుందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) హెచ్చరించింది. దేశ సమగ్రత, సెక్యూరిటీతోపాటు విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, కోర్టు ధిక్కారం వంటి కొన్ని కీలక అంశాల్లో పలు కొత్త నిబంధనలు తీసుకొచ్చామని.. వీటిని విలేకరులు పాటించాల్సిందేనని పీఐబీ స్పష్టం చేసింది. దేశం మొత్తం మీద 2,400 మంది జర్నలిస్టులకు పీఐబీ అక్రిడేషన్ ఉంది. పీఐబీ కొత్త నిబంధనలన్నీ వీరికి వర్తించనున్నాయి. ఈ ఏజెన్సీ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు తేలితే ఆ జర్నలిస్టుల అక్రిడేషన్ తొలగిస్తారు. ఇకపై అక్రిడేషన్ కార్డులను దుర్వినియోగం చేసినా పీఐబీ తీవ్రంగా పరిగణించనుంది. అలాంటి వారి అక్రిడేషన్ ను వెంటనే తొలగిస్తామని ఏజెన్సీ వార్నింగ్ ఇచ్చింది. 

మరిన్ని వార్తల కోసం:

టాలీవుడ్.. మోడీ పొగిడారని పొంగిపోవద్దు

కరోనాకు ఇప్పట్లో అంతం లేేదు

మన దేశంలో మంచి రోజులు అంతంత మాత్రమే